Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఇంకో నిర్ణయం అట్టర్ ప్లాప్ అయింది
By: Tupaki Desk | 8 Oct 2017 5:38 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న టైమింగ్ - ప్లానింగ్ లేని నిర్ణయం లక్షలాది మంది నిరుద్యోగులను షాక్ ఇస్తోందని విద్యావేత్తలు అంటున్నారు. సరైన ప్రణాళిక లేక హడావుడిగా నిర్ణయం తీసుకోవడం...అవి కేంద్ర ప్రభుత్వంతో ముడి పడి ఉన్నవి కావడం...వాటికి అనుమతి దక్కకపోవడం....తిరిగి మొదటి నుంచి ప్రారంభించాల్సి రావడంతో లక్షలాది నిరుద్యోగులు ఉద్యోగమో రామచంద్రా అనే పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇంతకాలం ఉద్యోగాల భర్తీకి ప్రాతిపదిక కొత్త జిల్లాలా? పాత జిల్లాలా? అన్న దానిపై సందిగ్ధం నెలకొనగా అయితే కొత్త జిల్లాల ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం స్పష్టం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ కూడా జిల్లాల ప్రాతిపదికన జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఇన్నాళ్లు నిరుద్యోగుల్లో ఉన్న ఉత్కంఠకు తెరపడింది. అయితే ముఖ్యమంత్రి ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల మరింత ఆలస్యం అవుతుందని అర్థమవుతోందని అంటున్నారు.
జోనల్ వ్యవస్థను రద్దు చేస్తామని, రాష్ట్రంలో ఇకనుంచి జిల్లా - రాష్ట్ర స్థాయి క్యాడర్లే ఉంటాయని ఇంతకాలం ప్రకటనలతో ఊదరగొట్టారు. అయితే దానికి భిన్నంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో జోన్లు పెంచడం అనివార్యమని తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం గమనార్హం. చేతులు కాలాక... ఆకులు పట్టుకున్న చందంగా ముఖ్యమంత్రి వ్యవహారం ఉందని పలువురు విమర్శిస్తున్నారు. దసరా కానుకగా 2016లో కొత్త జిల్లాలు ఆవిర్భవించాయి. అయితే రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ ఉందని - జిల్లా - జోనల్ - మల్టీ జోనల్ - రాష్ట్రస్థాయి క్యాడర్ పోస్టులున్నాయని ప్రభుత్వానికి ముందే తెలుసు. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంది. ఇవన్నీ తెలిసినా జోనల్ వ్యవస్థను రద్దు చేస్తామని ప్రచారం చేశారు. జోనల్ వ్యవస్థను రద్దు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుందని, కేంద్ర హోంశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్రపతి ఆమోదానికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అయినా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కాలయాపన చేసేందుకు అన్నట్లుగా ఇష్టమొచ్చినట్టుగా ప్రకటనలు చేశారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడానికి ముందే జోనల్ వ్యవస్థ - ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అధ్యయనం కోసం కమిటీ రూపొందిస్తే బాగుండేదని నిపుణులు సూచిస్తున్నారు.
కొత్త జిల్లాలు ఏర్పడే నాటికే ఆ కమిటీ నివేదిక రావడం, ప్రభుత్వం చర్చించి ఆ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే పంపించే అవకాశముండేదని అంటున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి సవరణలతో కూడిన రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చేవని చెప్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, జోనల్ వ్యవస్థ రద్దు వంటి నిర్ణయాలు మంత్రులు - అధికారులు - ఉద్యోగ సంఘాలు - మేధావులు - రాజకీయ పార్టీ నాయకులతో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్లే అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం తాజాగా నియమించిన కమిటీ అన్ని అంశాలనూ సమగ్రంగా పరిశీలించి నివేదిక రూపొందించేందుకు కనీసం 6 నుంచి 8 నెలల సమయం పట్టే అవకాశముంది. ఆ తర్వాత కేంద్రానికి పంపి రాష్ట్రపత్తి కొత్త ఉత్తర్వులు వచ్చేందుకు మరింత సమయం పట్టొచ్చు. ప్రభుత్వ తీరును చూస్తుంటే రాష్ట్రంలో ఇక ఉద్యోగ నియామకాల కోసం ప్రకటనలు ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవని అర్థమవుతోందని అంటున్నారు. రాష్ట్రంలో 84,878 పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఉపాధ్యాయ పోస్టులు 12,005 ఉన్నాయని ప్రకటించింది. డీఎస్సీ నోటిఫికేషన్ ఇక వస్తుందని అందరూ ఆశించారు. ఉపాధ్యాయ ఖాళీలపై సుప్రీం కోర్టు సైతం మొట్టికాయలు వేసింది. ఈనెల 28న సాక్షాత్తూ విద్యాశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి సుప్రీం కోర్టులో హాజరు కావాల్సి ఉంది. అయినా కొత్త జిల్లాల ప్రకారమే డీఎస్సీ వేస్తామని ప్రకటించడంతో ఉపాధ్యాయ అభ్యర్థుల ఆశలు నీరుగారాయి. ఇంకోవైపు నియోజకవర్గాల పునర్విభజన అంశం కేంద్రం పరిధిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం పెడచెవిన పెట్టింది. జోన్ల పెంపు - రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ అంశమూ కేంద్రం త్వరగా తేలుస్తుందని అనుకోవడానికి వీల్లేదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలకు భర్తీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నదని నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.