Begin typing your search above and press return to search.

ఏం పీక్కుంటారో పీక్కోండి: కేసీఆర్

By:  Tupaki Desk   |   20 Aug 2022 12:31 PM GMT
ఏం పీక్కుంటారో పీక్కోండి: కేసీఆర్
X
బీజేపీపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. మునుగోడు సభలో మాట్లాడిన కేసీఆర్ తనదైన తెలంగాణ యాసలో తిట్టిపోశారు. 'ఈడా.. బోడా.. రాబే' అని నేను అన్న.. ఈడీవోడు వచ్చి నాకే చాయ్ తాగిపిచ్చి పోవాలే.. దొంగలు భయపడుతారు.. ధర్మంగా ఉన్నవాళ్లకు భయమెందుకు? ఏం పీక్కుంటవో పీక్కో అని బీజేపీపై విరుచుకుపడ్డారు.ప్రజల కోసం ఆలోచించే వాళ్లు నీకు భయపడరు మోడీ.. నువ్ గోకినా.. గోకకున్నా నేను గోకుతా? అని కేసీఆర్ ధ్వజమెత్తారు.

ఇది ప్రజాస్వామ్యమా? అహంకారమా. బలుపా? అధికార మదంతో కళ్లు మూసుకుపోయినమా? అని కేసీఆర్ బీజేపీపై మండిపడ్డారు. నీ మీద ఈడీ కేసు పెడుతాం అంటున్నారని.. కేంద్రం దగ్గర వ్యవస్థలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు.

మన బావుల వద్ద బీజేపీ మీటర్ పెట్టుడేంది? మునుగోడులో టీఆర్ఎస్ ను గెలిపించి బీజేపీకి మీటర్ పెడుదాం.. భారత చరిత్రలో ఏ ప్రభుత్వ హయాంలో లేనంతగా రూపాయి విలువ మోడీ హయాలోనే పతనమైంది. దేశంలో ప్రతి ఇంటికి నీళ్లు, 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే.. దేశ రాజధానికి నీళ్లు, కరెంటే దిక్కు లేవు.. ఇది మీ పాలన అని కేసీఆర్ మండిపడ్డారు.

మునుగోడులో జరిగేది సాధారణ ఎన్నిక కాదని కేసీఆర్ అన్నారు. ఇది మన జీవితాల ఎన్నిక.. మన బతుకు దెరువు ఎన్నిక అని అభివర్ణించారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే మన బాయికాడ మీటర్ వస్తదని.. ఇది పక్కా అని రాసి పెట్టుకోండి అని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజలు దీన్ని గ్రహించి ఓటు వేయాలని సూచించారు.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడుతామంటున్న బీజేపీని మోడీ అహంకారమే పడగొడుతుందని స్పష్టం చేశారు. ఇక అమిత్ షాపై కూడా కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణను ఏం ఉద్దరించారని మునుగోడులో బీజేపీ సభ నిర్వహిస్తోందని కేసీఆర్ ప్రశ్నించారు. కనీసం కృష్ణా జలాల్లో తెలంగాణ వాటానైనా తేల్చని మీరు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు.

'బిడ్డా అమిత్ షా ఫ్లెక్సీలు పెట్టడం కాదు.. మా ప్రశ్నలకు సమాధానం చెప్పు.. రాష్ట్రపతి ఎన్నికలప్పుడు 20 ప్రశ్నలు అడిగితే ఒక్కదానికైనా సమాధానం చెప్పారా? ' అని మునుగోడు సభలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఉద్యమాలు చేయడం తెలంగాణకు కొత్త కాదని.. బీజేపీ తెలుసుకోవాలన్నారు.

మొత్తంగా మునుగోడులో కేసీఆర్ టార్గెట్ బీజేపీ అని కేసీఆర్ డిసైడ్ అయ్యాడు. ఈ మేరకు ఆ పార్టీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. బీజేపీ వ్యతిరేక విధానాలపై ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని యోచిస్తున్నట్టు తెలిసింది.