Begin typing your search above and press return to search.
చీరలు ఎపిసోడ్ లో ఆ మాటకు కేసీఆర్ హర్ట్!
By: Tupaki Desk | 22 Sep 2017 4:30 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన కొన్ని అంశాలు చాలా ఆసక్తిగా అనిపిస్తాయి. తన మాటలతో నిప్పులు చెరిగే కేసీఆర్ మైండ్ సెట్ కాస్త చిత్రంగా ఉంటుందని చెప్పాలి. విమర్శించాల్సిన అవసరం ఏర్పడితే నిపుల్లాంటి మాటలతో ప్రత్యర్థుల మీద ఎలాంటి దయాదాక్షిణ్యం దాడి చేస్తుంటారు. మరి ఇంత దూకుడుగా ఉండే కేసీఆర్.. తనకు తాను చాలా సెన్సిటివ్ గా కనిపిస్తుంటారు.
రాజకీయ విమర్శల్లో భాగంగా ఎదుటి వ్యక్తులకు మంట పుట్టేలా మాట్లాడే కేసీఆర్ కు.. ఆయన ప్రత్యర్థులు అదే తీరులో మాట్లాడితే మాత్రం విపరీతంగా హర్ట్ అవుతారని చెబుతారు. మరీ.. ముఖ్యంగా తన కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి ఎవరైనా ఏదైనా విమర్శ చేస్తే కేసీఆర్ నొచ్చుకుంటారని చెబుతున్నారు.
తన కుమార్తె కవిత.. కోడల్ని (కేటీఆర్ సతీమణి) కానీ ఏదైనా ఇష్యూలో విమర్శిస్తే ఆ విషయాన్ని ఆయన చాలా పర్సనల్ గా తీసుకుంటారని చెబుతారు. తాజా చీరల ఎపిసోడ్ విషయానికే వస్తే.. నాసిరకం చీరలు ఇస్తున్నారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా పలువురు మహిళలు.. ఇలాంటి చీరలు కవిత అయితే కడుతుందా? అంటూ విమర్శించారు. మరికొందరైతే ఒక అడుగు ముందుకేసి.. ఎంపీ కవిత కట్టే చీరల విలువ ఎంత ఉంటుందో ఆగ్రహంతో చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చీరల ఎపిసోడ్ లో తన కుమార్తెను ఉద్దేశించి చేసిన విమర్శలకు కేసీఆర్ వ్యక్తిగతంగా చాలా హర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. పండుగ వేళలో పసుపు కుంకుం కింద చీరలు పంపిణీ చేయాలని తాను తలిస్తే.. ఇచ్చిన చీరలు బాగోలేవని చెబుతూ తన కుటుంబ సభ్యుల్ని తిట్టటం బాగోలేదన్న మాటను తన సన్నిహితుల వద్ద కేసీఆర్ వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. తూటాల్లాంటి మాటలతో రాజకీయ ప్రత్యర్థులపై చెలరేగిపోయే కేసీఆర్ లో ఇలాంటి కోణం కాస్త ఆసక్తికరమేనని చెప్పాలి.