Begin typing your search above and press return to search.
హుజూరాబాద్ పై కేసీఆర్ వ్యూహమిదే?
By: Tupaki Desk | 5 Aug 2021 8:37 AM GMTతెలంగాణలో ప్రస్తుతం హుజూరాబాద్ పేరు మారుమోగుతోంది. ఒక ఉప ఎన్నిక ఇంతటి ఉత్కంఠతో సాగడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. అధికార పార్టీ నుంచి బర్తరఫ్ చేయబడ్డ మాజీ మంత్రిని ఓడించేందుకు అధికార టీఆర్ఎస్ చెమటోడ్చి శ్రమిస్తోంది. గులాబీ నేత గెలుపుకోసం రకరకాల ప్రభుత్వ పథకాలతో ప్రజలను ఆకట్టుకుంటోంది. అయితే ఎన్నో పథకాలు, ఆకర్షణీయమైన ప్రకటనల ద్వారా ప్రజలను తన వైపు తిప్పుకుంటోంది టీఆర్ఎస్.
అయితే ఇంతకీ పార్టీ క్యాండెట్ ఎవరనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే కొనసాగుతోంది. దళితుల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని చెబుతున్న కేసీఆర్ వారి కోసం దళిత బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళిత నేతకే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అయితే అభ్యర్థిగా దళిత అభ్యర్థిని నిలబెడుతారా..? అనే ప్రశ్నకు కాదనే తేలింది.
మొన్నటి వరకు కాంగ్రెస్ తరుపున నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. ఎంతో ఆడంబరంగా తన అనుచరులతో పార్టీలో చేరడంతో ఆయనకే టికెట్ కన్ఫాన్ అని అనుకున్నారు. కానీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయం చేయడంతో ఇక ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం లేనట్లేనని తేలింది. ఎస్సీకి చెందిన మండలాధ్యక్షుడికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో ఆ వర్గం నుంచి క్యాండెట్ ను బరిలోకి దింపే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీ నేతనే బరిలోకి దించుతారా..? అన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
అయితే బీజేపీ తరుపున ఈటల బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్ తరుపున ఎస్సీ అభ్యర్థి రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంద. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి బీసీ ఓట్లు దక్కుతాయా..? అన్న చర్చ సాగుతోంది. ఇక ఈటల ఇప్పటికే దళితులకు తన రాజీనామాతోనే దళిత బంధు పథకం వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ దళిత బంధును వ్యతిరేకించకుండా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని కోరుతున్నారు. ఈ తరుణంలో దళితులు ఎంత మంది టీఆర్ఎస్ వైపు ఉంటారోనన్న చర్చ కూడా మొదలైంది.
మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయబడ్డ ఈటల రాజేందర్ బీసీ సామాజిక వర్గ నేత. ఆరుసార్లుగా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడానికి బీసీ, ఎస్సీలే కారణమని తెలుస్తోంది. ఆయన భార్య జమున రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బీసీలు ఎక్కువగా ఈటలకు సపోర్టు చేస్తూ వస్తున్నారు. దీంతో ఆయన బీజేపీ తరుపున పోటీలో ఉండడంతో ఆయనకు బీసీల మద్దతు ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ టీఆర్ఎస్ తరుపున బీసీ కాకుండా వేరే సామాజిక వర్గం నుంచి బరిలోకి దించితే పార్టీకి వ్యతిరేకత ఏర్పడే ప్రమాదం ఉంది.
మరోవైపు నియోజకవర్గంలో బీసీల ఓట్లు లక్ష వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని బరిలోకి దింపితే ఈటల రాజేందర్ ఓట్లు చీల్చినట్లవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దళిత, యాదవులను పథకాలతో ఆకర్షించిన కేసీఆర్ బీసీ నేతను బరిలోకి దింపితే అన్నిరకాలుగా లాభిస్తుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే బీసీలకు సంఘ భవన నిర్మాణాలు, ఇతర పథకాలను వారికి అందేటట్లు చేస్తున్నారు. దీంతో వారి ఓట్లు దక్కితే గెలుపు సునాయాసమని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా కొందరు బీసీలు ఎంత మంది ఈటల వైపు వెళ్తారు..? టీఆర్ఎస్ వైపు వెళ్తారు..? అనే చర్చ సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ తరుపున ఎస్సీ అభ్యర్థి బరిలోకి దింపితే ఎస్సీల ఓట్లు చీలే అవకాశం ఉందని తెలుస్తోంది.