Begin typing your search above and press return to search.
యాదాద్రి సరే భద్రాద్రి సంగతేంటి కేసీఆర్?
By: Tupaki Desk | 8 Nov 2016 5:30 PM GMTయాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్ని యాదాద్రి పేరుతో అద్భుత ఆలయంగా తీర్చిదిద్దడం కోసం నిధులు విడుదల చేయడమేకాక ప్రత్యేక అథారిటీని కూడా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలంలోని రామాలయ అభివృద్ధిపై అదే శ్రద్ధను కనబరచకపోవడంపట్ల భద్రాచల వాసులు - రామభక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవాలయం కనీస అభివృద్ధికి నోచుకోవడం లేదని వాపోతున్నారు. ఆలయాభివృద్దిపై రాష్ట్ర విభజన తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొంటున్నారు. విభజన ఎఫెక్ట్ కు పాలకుల ఆలోచన తీరు తోడు అవడంతో భద్రాచల రాముడు కనీస సేవలకు కూడా తిప్పలు పడాల్సి వస్తోందని అంటున్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం పట్టణం మినహా భద్రాచలం మండలం - కూనవరం - చింతూరు - వీఆర్ పురం మండలాలు ఆంధ్రప్రదేశ్ లో విలీనమయ్యాయి. ఆ ప్రభావం రామాలయంపై పడింది. రామాలయాన్ని నిర్మించిన పెద్దలు ఆలయ ధూపదీప - నైవేద్యాల కోసం పురుషోత్తమ పట్టణ గ్రామంలో సుమారు1100 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ గ్రామం ఇప్పుడు తూర్పు గోదావరి (ఆంధ్రప్రదేశ్)లోకి వెళ్లింది. భద్రాచలం పట్టణాన్ని అనుకొని ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని ఎన్నో ఆందోళనలు నిర్వహించినా రెండు ప్రభుత్వాలు స్పందించలేదు. అయితే ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన భద్రాద్రికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు టీఆర్ ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే అది నెరవేరడంలేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు. రూ.100 కోట్లతో అభివృద్ది పనులను చేపడతామని చెప్పిన ఇంత వరకు ఆ దిశగా ప్రయత్నం జరగలేదు. జిల్లాల విభజన సమయంలో ఏర్పడిన జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా నామకరణం చేసిన వాజేడు - వెంకటాపురం మండలాలను వేరు చేసి నిరాశనే మిగిల్చారు. ఈ పరిస్థితుల్లో ఆలయ అభివృద్ధి అంశం చర్చనీ యాంశమైంది. దేవాలయ మాడ వీధుల అభివృద్ధి కోసం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సుమారు రూ.13 కోట్లు కేటాయించింది. తొలగించిన ఇళ్లకు పరిహారం పెద్ద రాద్ధాంతమైంది. చివరకు న్యాయస్థానం తీర్పు మేరకు పరిహారం చెల్లించారు. ఒప్పందం మేరకు జరగాల్సిన ఉద్యోగ నియామకాలు జరగలేదు. పనులు మధ్యలో నిలిచిపోయాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు రెండుసార్లు రామాలయాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయ అభివృద్ధిపై ప్రధాన హామీలు ఇచ్చారు. ఆలయ పునర్నిర్మాణానికి నూతన నమూనా తయారు చేయడం ఇతరత్రా అభివృద్ధిపై తానే ప్రత్యేక దృష్టిసారిస్తానన్నారు. అయితే అవి కార్యరూపం దాల్చడం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పుడు ఏ నిర్మాణం చేపట్టినా ఆలయ పరిసరాల్లోనే చేపట్టాల్సి ఉంది. పట్టణం మినహా మిగిలిన ప్రాంతం ఆంధ్రలో విలీనం కావడం ఎక్కడ ఆశించిన స్థాయిలో ప్రభుత్వ భూములు లేకపోవడంతో ఆలయ అభివృద్ధి నమూనా పట్టణాభివృద్ధితో ముడిపడింది. ఒకపక్క యాద్రాద్రి ఆలయ అభివృద్ధి శరవేగంగా జరుగుతుండడం భద్రాద్రిలో పనులు చేపట్టకపోవడంతో భక్తులు ఆవేదనకు గురవుతున్నారు. వీటన్నింటి దృష్టా భద్రాద్రి ఆలయాభివృద్దికి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపాలని హామీ మేరకు నిధులు విడుదల చేయాలని భక్తులు కోరుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/