Begin typing your search above and press return to search.

ఉద్య‌మ‌కారుల‌కు టికెట్లు ఏవి కేసీఆర్?

By:  Tupaki Desk   |   10 Oct 2018 8:50 AM GMT
ఉద్య‌మ‌కారుల‌కు టికెట్లు ఏవి కేసీఆర్?
X
తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకోవాల‌ని చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్-టీడీపీ పొత్తుపై మాట‌ల దాడి చేస్తూ రెండు నాల్కల ధోర‌ణిని అవ‌లంబిస్తూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఉద్య‌మ స‌మ‌యంలో అశువులు బాసిన తెలంగాణ అమ‌ర‌వీరుల‌కు టికెట్లు ఇవ్వ‌కుండా మ‌రోసారి వారికి కేసీఆర్ అన్యాయం చేశారు. అంతేకాకుండా, తెలంగాణ ఉద్య‌మంలో పాల్గ‌న‌ని వారికి, ఉద్య‌మానికి వ్య‌తిరేకంగా మాట్లాడిన వారికి - ఉద్య‌మానికి ఏవిధ‌మైన సంబంధం లేని వారికి టికెట్లు కేటాయించిన కేసీఆర్ పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. డ‌బ్బున్న‌వారికే టికెట్లు అన్న త‌ర‌హాలో కేసీఆర్ టికెట్ల పంపిణీ చేస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

తెలంగాణ ఉద్య‌మ‌ స‌మ‌యంలో ఆత్మాహుతి చేసుకొని మ‌ర‌ణించిన శ్రీ‌కాంతాచారి త‌ల్లి శంక‌రమ్మ‌కు కేసీఆర్ టికెట్ నిరాక‌రించారు. హుజుర్ న‌గ‌ర్ నుంచి టికెట్ ఆశించిన ఆమెను కేసీఆర్ ప‌ట్టించుకోలేదు. ఆ టికెట్ ను ఉద్య‌మానికి ఏమాత్రం సంబంధం లేని సైదిరెడ్డికి కేటాయించారు. తాజాగా మీడియాకు లీకైన మ‌లివిడ‌త జాబితాలో కూడా ఉద్య‌మ వ్య‌తిరేకుల‌కు టికెట్లు కేటాయించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మేడ్చ‌ల్ నుంచి ఎస్ మ‌ల్లారెడ్డి - మ‌ల్కాజ్ గిరి నుంచి మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు - ఖైర‌తాబాద్ నుంచి దానం నాగేంద‌ర్ - ముషీరాబాద్ నుంచి ముక్తా గోపాల్ - గోషా మ‌హ‌ల్ నుంచి ప్రేమ్ సింగ్ రాథోడ్ - కోదాడ నుంచి వేనేప‌ల్లి చంద‌ర్ రావు - వ‌రంగల్ ఈస్ట్ నుంచి న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్ ల‌కు కేసీఆర్ టికెట్లు కేటాయించిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు, పార్టీకి వీర‌విధేయులైన చొప్ప‌దండి సిట్టింగ్ ఎమ్మెల్యే బొడిగే శోభ‌ - మేడ్చ‌ల్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం సుధీర్ రెడ్డి - మ‌ల్కాజ్ గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే సీ క‌న‌కా రెడ్డిల‌కు కేసీఆర్ మొండిచెయ్యి చూపించారు.