Begin typing your search above and press return to search.
ఆంధ్రోళ్లు కాదు..హైదరాబాదీలు..కేసీఆర్ మంత్రం
By: Tupaki Desk | 3 Dec 2018 6:56 AM GMTకేసీఆర్ తాజాగా ఆంధ్రోళ్ల విషయంలో కొత్త స్ట్రాటజీ అవలంభించారు. గడిచిన 2014 ఎన్నికల్లో ఆంధ్రోళ్ల కాళ్లకు ముళ్లు గుచ్చితే పంటితో తీస్తానన్న కేసీఆర్ ఈసారి మాత్రం ఆంధ్రోళ్లను హైదరాబాదీలుగా కన్వర్ట్ కావాలని సూచించారు. నాతో పాటు మీరు కూడా వలసవచ్చి హైదరాబాద్ లో జీవిస్తున్నారని.. మనమంతా సెటిలర్లమని.. కాబట్టి హైదరాబాదీలుగా ఉందామని కేసీఆర్ సెటిలర్ల మనసు దోచే పనిని మొదలుపెట్టారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు..
తాజాగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో హైదరాబాద్ లో అశేషంగా ఉన్న సీమాంధ్ర సెటిలర్ల ఓట్లు సంపాదించేందుకు సరికొత్త వ్యూహాన్ని పొందారు. హైదరాబాద్ లో ఉన్న వాళ్లంతా ఆంద్రోళ్లుగా భావించవద్దని.. హైదరాబాదీలుగా భావించాలని కోరారు. తనది మెదక్ జిల్లా అని తాను హైదరాబాద్ లో ఉంటున్నానని.. మీరు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటున్నారని.. మనమంతా హైదరాబాదీలుగా ఉందామని.. కలిసిరావాలని సీమాంధ్రులను బుజ్జగించారు.
ఇక పలు ఉదాహరణలు కూడా కేసీఆర్ ఇచ్చారు. ఈసారి హైదరాబాద్ చుట్టుపక్కల ఎమ్మెల్యే సీట్లను పలువురు ఆంధ్రా మూలాలున్న వారికి ఇచ్చామని.. గడిచిన జీహెచ్ ఎంసీ ఎన్నికల్లోనూ కార్పొరేటర్లుగా ఆంధ్రా వారికి సీట్లు ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఆంధ్రా ప్రాంతాల్లోని కార్పొరేటర్లు ఆ ప్రాంతం వారేనని చెప్పుకొచ్చారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఆంధ్రా ప్రజలంతా టీఆర్ ఎస్ కు మద్దతిచ్చినట్టే ఈసారి ఇవ్వాలని కోరారు. మరి కేసీఆర్ వేసిన ఈ ఎత్తుగడ ఫలిస్తుందో లేదో చూడాలి మరి..