Begin typing your search above and press return to search.
డిప్రెషన్ లో కేసీఆర్.... జైలుకు పోతాననే భయం పట్టుకుంది!
By: Tupaki Desk | 2 Feb 2022 4:34 AM GMTతెలంగాణలో ప్రస్తుతం హాట్ హాట్ రాజకీయలు నడుస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ రేంజ్‌లో స్పందిస్తుండగా... తాము సైతం తగ్గేది లేదంటూ బీజేపీ నేతలు రియాక్టవుతున్నారు. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీకి నిద్రపట్టడం లేదంటూ కామెంట్ చేశారు. ఆయనదో కురచ బుద్ధి అంటూ వ్యక్తిగత వ్యాఖ్యలు సైతం చేశారు. ఇంతేకాకుండా కేంద్రం విధానాలను, బడ్జెట్‌ను సైతం సీఎం కేసీఆర్ తూర్పారపట్టారు. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు.
బీజేపీకి దేశవ్యాప్తంగా వ్యతిరేక గాలి వీస్తోందని, ఐదు రాష్ట్రాల ఎన్నికలు దీనికి అద్దం పట్టబోతున్నాయని సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. దీనిపై బీజేపీ సైతం అదే రీతిలో స్పందించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట , ఆలోచన తీరు ముఖ్యమంత్రి స్థాయిలో లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేంద్రం నదుల అనుసంధానం చేస్తే కమీషన్లు దండుకునే అవకాశం ఉండదనే అక్కసుతో మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తావా? అంటూ ప్రశ్నించారు. `` కేసీఆర్... నీ భాషను చూసి కుక్కలు, నక్కలు కూడా సిగ్గు పడుతున్నయ్... కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ ఐ, సహార స్కాంలు చేసినవ్ కదా... వెలుగుబంటి సూర్యనారాయణతో కలిసి దోచుకున్నవ్ కదా...అవన్నీ తీస్తున్నం... సీఎంగా ఉంటూ వేల కోట్లు దోచుకుతింటున్నవ్ కదా... అవన్నీ బయటకు వస్తున్నయ్...జైలుకు పోతడని అర్ధమై డిప్రెషన్ లోకి వెళ్లి కేసీఆర్ ఇదంతా చేస్తుండు. కేసీఆర్ ఎన్ని మాటలు చెప్పినా.. సెంటిమెంట్ రగిల్చాలనుకున్నా అది సాధ్యం కాదు.. ఎందుకంటే కేసీఆర్ సంగతి అర్ధమైపోయింది. ఆయన అరెస్టు కావడం తథ్యం.`` అంటూ బండి సంజయ్ జోస్యం చెప్పారు.
భారత రాజ్యాంగాన్ని కల్వకుంట్ల రాజ్యాంగంగా మార్చాలనుకుంటున్న కేసీఆర్ లక్ష్యం నెరవేరదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటున్న సీఎం కేసీఆర్ ఇన్ని రోజులు ఏం చేశారని బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడాలని అనుకుంటే తాను ప్రధాని అపాయిట్ మెంట్ ఇప్పిస్తానని పేర్కొన్న బండి సంజయ్ ఆయనకు దమ్ముంటే వెళ్లి మాట్లాడాలని కోరారు.
తెలంగాణ సెంటిమెంట్ రగల్చి బ్లాక్ మెయిల్ చేసేందుకే కేసీఆర్ ఇదంతా చేస్తున్నడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం పట్టింపు లేదని ఆరోపించారు. ఇకనైనా భాష మార్చుకోవాలని సీఎంను హెచ్చరిస్తున్నానని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.