Begin typing your search above and press return to search.
హుజూరాబాద్ లో కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న దళితబందు
By: Tupaki Desk | 12 Aug 2021 2:44 AM GMTఏదైనా మందుతో రోగం తగ్గటం మాత్రమే కాదు.. కొన్ని సందర్భాల్లో కొత్త రోగాన్ని తీసుకొచ్చే సైడ్ ఎఫెక్టులు ఎదురవుతాయి. తాజాగా అలాంటి పరిస్థితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎదురవుతోంది. ఆయన బుర్రలో పుట్టిన దళిత బంధు కార్యక్రమంతో మైలేజీ మాత్రమే కాదు.. ఇప్పుడు డ్యామేజీ మొదలైందన్న మాట వినిపిస్తోంది. దళితులకు రూ.10లక్షల మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలో వేసేలా.. దేశంలో మరెక్కడా లేని రీతిలో తీసుకొచ్చిన ఈ పథకం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని మూడున్నర కోట్ల మందిలో అత్యధికులు బీసీలే అన్న విషయాన్ని మర్చిపోకూడదు.
బీసీల్లో అత్యల్ప ఆదాయ వర్గాలు.. సమాజంలో వెనుకబడిన వారు బోలెడంత మంది ఉన్నారు. దళితులకు ఇచ్చే రూ.10లక్షలకు అభ్యంతరం పెట్టటం లేదు. మరి.. సమాజంలో వెనుకబడిన తమ సంగతేమిటి? అన్న బీసీల మాట ప్రభుత్వానికి కొత్త ఇబ్బందుల్ని తీసుకొచ్చి పెడుతోంది. నాలుగేళ్ల క్రితం బీసీ మంత్రులు.. బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి కూర్చొని 210 తీర్మానాల్ని చేసి ఆమోదించారు. సబ్ ప్లాన్ ద్వారా నిధులు ఏర్పాటు చేసి ఆయా వర్గాలకు ఖర్చు చేయాలని డిసైడ్ అయ్యారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఖర్చు చేయటానికి అవసరమైన నిధులు లేకపోవటంతో ఏళ్ల తరబడి బీసీ సంక్షేమ శాఖ ఖాళీగా ఉండటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. బీసీల బతుకుల్ని బాగు చేసేందుకు ప్రత్యేక పాలసీ అంటూ ఉదరగొట్టిన ప్రభుత్వం.. తమను గాలికి వదిలేసిందన్న వేదన వ్యక్తమవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 5.2 లక్షల లోన్ అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. వీరిలో యాభై వేల మందికి మాత్రమే లోన్లు అందాయని.. మిగిలిన ఐదు లక్షల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నట్లు చెబుతున్నారు.
తమ అభ్యున్నతిని గాలికి వదిలేసిన ప్రభుత్వం.. ఇప్పుడు దళిత బంధు పేరుతో రూ.10లక్షల చొప్పున బ్యాంకు ఖాతాలో వేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తమ వరకు వచ్చేసరికి నిధుల కొరత అని చెబుతూ.. వారికి మాత్రం అంత భారీగా నిధులు ఎలా తీసుకొస్తున్నారన్న ప్రశ్నను సూటిగా సంధిస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా సంచార జాతుల్ని గుర్తించి వారి డెవలప్ మెంట్ కోసం బడ్జెట్ లో రూ.2433 కోట్లు కేటాయించారని.. కానీ అందులో రూ.350 కోట్లు మాత్రమే ఖర్చు చేశారంటున్నారు. తమను పట్టించుకోకుండా.. దళిత వర్గానికి మాత్రం నేరుగా రూ.10లక్షలు ఇవ్వటం ఏమిటి? అని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏదో చేయబోతే మరేదో అయినట్లుగా.. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెర మీదకు వచ్చిన దళిత బంధు.. సీఎం కేసీఆర్ కు కొత్త దడగా మారిందన్న మాట వినిపిస్తోంది.