Begin typing your search above and press return to search.
కేసీఆర్ నోటి నుంచి జై తెలంగాణకు బదులుగా జైభీం ఎందుకు?
By: Tupaki Desk | 17 Aug 2021 11:30 AM GMTతెలంగాణ రాష్ట్ర సమితి అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోట వచ్చే ఒక మాటకుండే శక్తి ఏమిటన్నది అందరికి తెలిసిందే. వేదిక ఏదైనా.. తన ప్రసంగం చివరన ఆయన నోటి నుంచి వచ్చే ఒక మాటకుండే మేజిక్ అంతా ఇంతా కాదు. అలాంటిది తాజాగా హుజూర్ నగర్ లో నిర్వహించిన దళితబంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన కేసీఆర్.. చివర్లో తన మార్కు చూపించే.. ‘‘జై తెలంగాణ’’ మాట మిస్ అయ్యింది. తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుంచి ఆయన నోటి నుంచి ప్రతి సభ చివర్లోను రావటం.. కొన్నిసార్లు ఆయన ప్రత్యేకంగా చెప్పి మరీ ప్రజల చేత నినాదం చేయటం తెలిసిందే.
సోమవారం సభలో మాత్రం సీఎం కేసీఆర్ నోటి నుంచి జై తెలంగాణ నినాదం స్థానే.. జై భీం అన్న మాట రావటం ఆసక్తికరంగా మారింది. దేశంలో సరికొత్త విప్లవానికి హుజూరాబాద్ వేదిక అయ్యిందని.. ఈ పథకం రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా అమలు కానుందన్న మాట ఆయన నోటి నుంచి వచ్చింది. జై తెలంగాణ నినాదానికి బదులుగా జైభీం మాట కేసీఆర్ నోటి నుంచి రావటం ఏమిటన్న దానిపై ఆసక్తికర చర్చ మొదలైంది.రాజకీయ వర్గాల విశ్లేషణ ప్రకారం మూడు అంశాలు తాజా మార్పునకు కారణంగా చెబుతున్నారు.
అందులో మొదటిది..ఇటీవల బహుజన సమాజ్ వాదీ పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ కారణంగా చెబుతున్నారు. ఐపీఎస్ అధికారి అయి ఉండి కూడా గురుకులాల్ని బలోపేతం చేయటం కోసం ఆయన చేపట్టిన పదవి.. తర్వాతి కాలంలో సేర్వోను ఆయనో శక్తిగా మార్చటం.. రానున్న రోజుల్లో తనకు ఎదురయ్యే ప్రమాదాన్ని.. సవాళ్లను గుర్తించిన కేసీఆర్ తన మేజిక్ మాటలో మార్పును తెచ్చినట్లుగా చెబుతున్నారు. జై తెలంగాణ మాట కేసీఆర్ నోటి నుంచి రాకున్నా ఫర్లేదు. ఎందుకంటే.. ఆ మాటకు ఆయనే పూర్తి హక్కుదారు అని ఆయన నమ్మటమే కాదు.. తెలంగాణలోని మెజార్టీ ప్రజల నమ్మకంగా ఉన్న నేపథ్యంలో.. తన తర్వాతి లక్ష్యమైన ‘జైభీం’ను.. మిగిలిన వారి కంటే ముందే తన సొంతం చేసుకోవాలన్న ఎత్తుగడే కనిపిస్తుందంటున్నారు.
రెండో అంశం.. జాతీయ రాజకీయాల మీద కేసీఆర్ కు ఆసక్తి ఉంది.ఆ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు చెప్పారుకూడా. అయితే..అదేమీ అనుకున్నంత సులువు కాదు. ఆ విషయం కేసీఆర్ కు తెలుసు. అందుకే.. వ్యూహాత్మకంగా దేశ వ్యాప్తంగా చర్చకు తెర లేపేలా ఆయనీ పథకాన్ని హైలెట్ చేయటంతో పాటు.. జాతీయ స్థాయిలో దళితుల హక్కుల గురించి.. వారి మీద తనకున్న సానుకూలతను తెలియజేయటం కోసం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన దళిత ప్రముఖుల్ని చేరదీయటం ద్వారా.. జాతీయరాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోనున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే.. జై తెలంగాణకు పరిమితమైతే నష్టం.. అందుకే సమయానికి తగ్గట్లే ఆయన నోటి నుంచి జైభీం వచ్చేసిందని చెబుతున్నారు.
మూడో విషయానికి వస్తే.. జైభీం నినాదం కొత్తదేమీ కాకున్నా..దానికి హక్కుదారు అంటూ ఎవరు లేరు. అలాంటి నినాదాన్ని తన వశం చేసుకుంటే.. వారి పక్షాన పోరాడే నాయకుడిగా అందరి మనసుల్లో ముద్ర వేయగలిగితే.. అది ఆయనకు బలంగా మారుతుంది. అందుకే.. తనను ఈ స్థాయికి తెచ్చిన జై తెలంగాణ నినాదాన్ని పక్కన పెట్టి.. జై భీం నినాదాన్ని తీసుకున్నారని చెప్పాలి. సమయానికి తగ్గట్లు నినాదాన్ని మార్చటం వూహ్యాత్మకమేనన్న విషయం తాజా చర్యలతో కేసీఆర్ స్పష్టం చేశారన్న మాట వినిపిస్తోంది.