Begin typing your search above and press return to search.
కేంద్రానికీ, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వైరం: జగన్-కు మద్దతుగా కేసీఆర్
By: Tupaki Desk | 19 May 2022 3:28 AM GMTచాలా రోజుల నుంచి నలుగుతున్న ఓ వివాదం ఇది. నిధుల విషయమై కేంద్రానికీ, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వైరం ఉంది. స్థానిక సంస్థలకు నిబంధనల అనుసారం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నేరుగా కేంద్రం నిధులు విడుదల చేయడం, సర్పంచ్ ల ఎకౌంట్లకే ఆయా నిధులను జమ చేయడం అన్నవి చేస్తుంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వారికి చెప్పాపెట్టకుండా డబ్బులు గుంజుకుని, తరువాత విడుదల చేస్తాం అని చెప్పడం వంటివి జరుగుతూనే ఉన్నాయి.
గతంలో ఆంధ్రావనిలో ఇలాంటి పరిణామాలు ఒకటి కాదు రెండు కాదు ఈ మూడేళ్లలో మూడు సార్లు జరిగాయి. దాంతో కేంద్రానికి కోపం వచ్చి, వేరే అకౌంట్లను ఓపెన్ చేసుకోవాలని, వాటిలోనే తాము నిధులు జమ చేస్తామని, వాటిని గ్రామీణాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, సంబంధిత పనులు చేపట్టాలని మోడీ వర్గాలు సుస్పష్టంగా చెబుతున్నాయి. కానీ ఈ నిర్ణయం జగన్ కు మింగుడు పడడం లేదు.. అని, ఆయన మాట్లాడలేకే కేసీఆర్ తో మాట్లాడిస్తున్నారని విపక్షం మండిపడుతోంది.
పాయింట్ నంబర్ 1 : రాష్ట్రాలను ఎందుకు నమ్మాలి
పాయింట్ నంబర్ 2 : ఇప్పటికే నరేగా (ఉపాధి హామీ చట్టం)
నిధులు పక్కదోవ పట్టించిన వైనంపై మాట్లాడరు ఎందుకని?
పాయింట్ నంబర్ 3 : కరోనా బాధిత కుటుంబాలకు ముఖ్యంగా
మృతుల కుటుంబాలకు కేంద్రం సాయం చేయమని రూ.1200 కోట్లు
ఏపీకి ఇస్తే అవి ఇప్పటిదాకా ఎందుకని చెల్లించలేదని సుప్రీం
ప్రశ్నిస్తే సమాధానం లేదు ఎందుకని ?
మొదటి వాదన ఏంటంటే రాష్ట్రాలను కేంద్రం నమ్మడం లేదు అని కేసీఆర్ ఫైర్ అవుతున్నారు. కానీ నమ్మి ఏం సాధించాలి అని బీజేపీ వర్గాలు ఎదురు ప్రశ్నిస్తున్నాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు నిధులు ఇస్తే వాటిని రాష్ట్రాలు తమ పథకాలుగా చెలామణీ చేసుకుంటున్నాయి.
అదేవిధంగా నిధులు కూడా కొన్ని సార్లు పక్కదోవ పట్టిన వైనంపై నిలదీస్తే ఇష్యూని ఏదో ఒక విధంగా డైవర్ట్ చేస్తున్నాయి. ఇదే విధంగా గతంలో అనేక ఘటనలు జరిగాయి. వీటిపై కేసీఆర్ మాట్లాడకుండా, జగన్ మాట్టాడకుండా దాటవేత ధోరణికే ప్రాధాన్యం ఇస్తున్నారన్నది బీజేపీ మాట. ఇదే వారి వాదన కూడా !