Begin typing your search above and press return to search.
పుతిన్ మాదిరి ఉండాలని కేసీఆర్ ఫిక్స్ అయ్యారా?
By: Tupaki Desk | 25 March 2020 5:30 PM GMTఎప్పటికప్పుడు అప్డేట్ కావటమే కాదు.. తన దగ్గర ఎంత సమాచారం ఉంటుందన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన మాటలతో తెలిపే ప్రయత్నం చేస్తారు. కరోనా వేళ.. కవులకు చేతి నిండా పని పెట్టటమే కాదు.. వారు రాసిన కవితల్ని మీడియాలో వచ్చేలా చూడాలన్న మాటను చెప్పేశారు. అంతేకాదు.. తనకు నచ్చిన కవితను కూడా చెప్పేసిన ఆయన.. కవులు.. వారి కవిత్వంతో సరిపెట్టకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు.
కేసీఆర్ తాజా మాటలు విన్నప్పుడు ఆయన మీద రష్యా అధినేత వాద్లిమిర్ పుతిన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్పక తప్పదు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే విషయంలో సక్సెస్ అయిన దేశాల్లో రష్యా ఒకటి. అయితే.. ఇది చైనాకు మిత్ర దేశం కాబట్టి.. తాను పుట్టించిన వైరస్ ను తన మిత్రదేశంలో సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నారన్న ప్రచారం కొన్ని మీడియా వార్తల్లోనూ.. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున వస్తున్నాయి.
అయితే.. రష్యా అధినేత పుతిన్ ఎంత కరకుగా నిర్ణయాలు తీసుకుంటారన్న విషయాన్ని.. కరోనా విషయంలో ఆయన వ్యాఖ్యలే నిదర్శనం. బుద్దిగా ఇంట్లో ఉంటారా?.. బయటకు వచ్చి ఐదేళ్లు జైల్లో ఉంటారా? అన్న స్టేట్ మెంట్ ను సింఫుల్ గా చెప్పేసి.. తానేం చేయాలనుకుంటున్నారో చెప్పేశారు. పుతిన్ కరకు మాటతో ఆ దేశస్తులు దెబ్బకు దారిలోకి రావటమే కాదు.. ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టటం లేదు. ఆయన మాటల ప్రభావం.. దానికి ఆ దేశస్తులు స్పందించిన తీరు కేసీఆర్ మీద బాగానే ప్రభావం చూపించినట్లుంది.
అందుకే ఆయన.. దేశంలో మరే ముఖ్యమంత్రి నోటి నుంచి రాని రీతిలో కనిపిస్తే కాల్చివేత వరకైనా వెళ్లటానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్లో నుంచి మాట వచ్చినంతనే అవన్నీ జరిగిపోతాయని కాదు కానీ.. బాధ్యత లేకుండా అదే పనిగా బయటకు వస్తున్న ప్రజల తీరుతో విసిగిపోయిన వేళ.. వెన్నులో చలిపుట్టే మాట చెప్పాలన్న ఉద్దేశం కేసీఆర్ తాజా మాటల్లో కనిపిస్తుందని చెప్పాలి. అయితే.. దీనంతటికి ఆయనకు స్ఫూర్తి రష్యా అధ్యక్షుడు పుతినే. అందుకే.. తన మీడియా సమావేశం చివర్లో తన స్ఫూర్తిదాత.. ఆయన కరకు మాటల్ని ప్రస్తావించటం కనిపిస్తుంది.