Begin typing your search above and press return to search.

అంతా 10 నిమిషాల్లో పూర్తి చేసేస్తారట!

By:  Tupaki Desk   |   11 Oct 2016 6:03 AM GMT
అంతా 10 నిమిషాల్లో పూర్తి చేసేస్తారట!
X
తెలంగాణ కొత్త జిల్లాలకు సంబంధించిన అధికారిక జీవోలు విడుదలైన సంగతి తెలిసిందే. మరి.. కొత్త జిల్లాల కొలువు తీరేదెప్పుడన్న విషయానికి వస్తే..ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకోనుంది. కొత్త జిల్లాలుగా ఏర్పాటు అవుతున్న 21 జిల్లాల్ని కేవలం 10 నిమిషాల వ్యవధిలో ప్రారంభించాలని డిసైడ్ చేశారు. ముహుర్తాలకు పెద్ద పీట వేసే ముఖ్యమంత్రి కేసీఆర్ కారణంగా.. స్వల్ప వ్యవధిలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయనున్నారు.

కొత్త జిల్లాలకు సంబంధించిన కీలక కార్యక్రమమైన కొత్త కలెక్టరేట్లను ముఖ్యమంత్రి మొదలు.. మంత్రులు.. ఇతర ప్రముఖులంతా కలిసి ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ముహుర్తాన్ని సిద్ధం చేశారు.మంగళవారం ఉదయం 11.12 గంటల నుంచి 11.22 గంటల మధ్య 21 కొత్త కలెక్టరేట్లను ప్రారంభించనున్నారు. సిద్ధిపేట జిల్లాను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనుండగా.. మిగిలిన జిల్లాల్ని అసెంబ్లీ స్పీకర్.. మండలి ఛైర్మన్ తో సహా మంత్రులు ఇతర ప్రముఖులు స్టార్ట్ చేయనున్నారు.

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. కొత్త జిల్లాలకు సంబంధించిన కీలకమైన జీవోల విడుదలను కర్కాటక లగ్నంలో విడుదలయ్యేలా ముహుర్తం డిసైడ్ చేస్తే..కొత్త జిల్లాలకు సంబంధించిన కలెక్టరేట్ల ప్రారంభానికి ధనుర్ లగ్నంలో ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో.. పది నిమిషాల వ్యవధిలో తెలంగాణవ్యాప్తంగా 21 కొత్త జిల్లాల కలెక్టరేట్లు ప్రారంభం కానున్నాయి.

తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధిపేట జిల్లా కలెక్టరేట్ ను లాంఛనంగా ప్రారంభించిన క్షణం తర్వాత నుంచి మిగిలిన 20 జిల్లాల్ని ఏకకాలంలో ప్రముఖులు ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా గౌరవ వందనం స్వీకరించటం..కలెక్టర్లు.. జాయింట్ కలెక్టర్లు కొత్త బాధ్యతల్ని స్వీకరించటం.. అనంతరంప్రజాప్రతినిధులతో భేటీ అయి.. ఏదైనా సంక్షేమ కార్యక్రమం కింద లబ్థి చేకూరేలాని ర్ణయం తీసుకొని.. అన్ని జిల్లాల్లో తొలిరోజు పాలనను షురూ చేస్తారు. ఇదంతా.. పది నిమిషాల వ్యవధిలో ఏ జిల్లాకు ఆ జిల్లాలో పూర్తి అయ్యేలా చేస్తారు. ఇందుకు సంబంధించిన పనులన్నింటిని అధికారులు పూర్తి చేయటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/