Begin typing your search above and press return to search.
ఆ ఓట్లు సంపాదిస్తే చాలంటున్న కేసీఆర్
By: Tupaki Desk | 25 Oct 2017 6:14 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు కులాల సమీకరణాలపై దృష్టిసారించారు. ఏకకాలంలో ఇటు వచ్చే ఏడాది జరగబోయే పంచాయతీ ఎన్నికలు - షెడ్యూల్ ప్రకారం 2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై కన్నువేశారు. ఈ క్రమంలో పక్కా ప్రణాళికలపై దృష్టిసారించడమే కాకుండా...తమ మంత్రివర్గ సహచరులకు సైతం ఆర్డర్ వేశారు. టీఆర్ ఎస్ పార్టీలోని విశ్వసనీయవర్గాల ప్రకారం ఎస్సీ - ఎస్టీలతో పాటు ఆయా కులవృత్తిదారులపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ప్రేమ కనబరుస్తోంది. ఈ రెండు వర్గాల్లో ఎక్కువ భాగం సామాజిక సంఘాల్లో ఉంటూ ఆందోళనలు చేస్తున్నారని, వారందరినీ టీఆర్ ఎస్ పార్టీవైపు మళ్లించేందుకు దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ మంత్రులను ఆదేశించారు. వారికి దగ్గరయ్యేందుకు వ్యూహాలను రచించాలన్నారు.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో - ఆ తర్వాత మరికొందరు మంత్రులతో సమావేశమైన సందర్భంగా ఈ మేరకు కేసీఆర్ తన ప్లాన్ వివరించినట్లు సమాచారం. చాలారోజుల తర్వాత జరిగిన కేబినెట్ సమావేశం కావడంతో సుదీర్ఘంగా సుమారు ఏడున్నర గంటల పాటు జరిగిన క్యాబినెట్ లో ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ప్రజలను ఆకట్టుకునేందుకు ఏమేమి చేస్తే బాగుంటుందనేది సీఎం వివరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్పు అంశంపై చర్చ జరుగుతున్న క్రమంలో సీఎం కేసీఆర్ రాజకీయాలను కూడా ప్రస్తావించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ - బీజేపీ వంటి ప్రతిపక్షాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, వారు ఏ అంశాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తారో అందరికీ తెలుసునని సీఎం అన్నారు. అయినా అన్ని అంశాలను క్షుణంగా అధ్యయనం చేసి సిద్ధమై రావాలన్నారు. ప్రతిపక్షాలు అడిగినవి కాకుండా, ప్రజలకు సమాధానం చెప్పుకునే విధంగా ఉండాలని చెప్పారు.
ప్రభుత్వ పథకాలను ప్రజలందరిలోకి తీసుకెళ్లాలని, ఎవరెవరి కోసం ఏయే పథకాన్ని ప్రారంభించింది....ఏ విధంగా లబ్ది చేకూరుతున్నదో వివరించాలని సీఎం కేసీఆర్ మంత్రివర్గ సహచరులకు కోరారు. దీనిద్వారా రాబోవు గ్రామ పంచాయతీల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేలా మంత్రులు - ప్రజాప్రతినిధులు పాటుపడాలని అన్నారు. ఏ ఒక్కరినీ చిన్నచూపు చూడడానికి వీల్లేదని జాగ్రత్తలు చెప్పారు. ప్రజలు ఎటువైపో ఉన్నారో ఆలోచించాలని, సమస్యలను పరిష్కరించుకునేందుకు ఎక్కువమంది స్థానికంగా ఉన్న సామాజిక సంఘాల వైపు ఆకర్షితులవుతున్నారని, వారికి ఈ ప్రభుత్వం మంచిగా చేస్తుంది అన్న అభిప్రాయాన్ని కల్పించాలని సీఎం కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. చేస్తున్న వాటిని ప్రజలకు చెప్పాలని కోరినట్టు సమాచారం.
మరోవైపు ఇటీవల గొర్రెల పంపిణీ - చేపల పంపిణీతో పాటు పాల ఉత్పత్తిదారులకు చేయూత ఇస్తామని ప్రకటించడం, నాయీ బ్రాహ్మణులకు - ఎంబీసీలకు బడ్జెట్ లో నిధులు కేటాయించడం వంటి వాటిని ప్రస్తావించినట్టు తెలిసింది. రాబోవు పంచాయతీ ఎన్నికలు - సాధారణ ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ ఎస్ ప్రభుత్వం గ్రామాలపై దృష్టి సారించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు పట్టణాల్లో నివసిస్తున్న వారు వెళుతుంటారని, అటువంటి వారిని కూడా ఆకర్షించడమే పనిగా పెట్టుకుందని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల నాటికి తగిన వ్యూహాలను మంత్రులు ఇప్పటి నుంచే అమల్లో పెట్టాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం.