Begin typing your search above and press return to search.
మంత్రులందరికీ కేసీఆర్ కీలక సూచనలు
By: Tupaki Desk | 5 Sep 2018 4:05 AM GMTతెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు జోరందుకున్న తరుణంలో అసెంబ్లీ రద్దుకు ముహూర్తం కూడా ఖరారు అయిందనే వార్తలు వస్తున్నాయి. మంగళవారం జరిగిన పరిణామాలు ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి. అసెంబ్లీ రద్దు చేస్తే తలెత్తే పరిణామాలపై సీఎం కేసీఆర్ రోజంతా ఉన్నతాదికారులతో చర్చలు జరిపారని - ఈ సమావేశంలో దేశంలో గత అనుభవాలపై చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఈ చర్చల ప్రకారం సెప్టెంబర్ 6న ఉదయం 6.45 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో అసెంబ్లీ రద్దుపై కేబినెట్ తీర్మానం చేయనుంది. ఆ తర్వాత సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీని రద్దు చేయనున్నారు.అయితే, ఈ పరిణామాల నేపథ్యంలో తన మంత్రివర్గ సహచరులకు కేసీఆర్ కీలక ఆర్డర్ వేశారు.
ముందస్తుకు సిద్ధమైన కేసీఆర్ ఎమ్మెల్యేలకు - మంత్రులు ఫోన్ కాల్స్ చేయించినట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలలో పెండింగ్ లో ఉన్న శంకుస్థాపనలు - ప్రారంభోత్సవాలను రేపు - ఎల్లుండిలోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యేలను ఆదేశించారని తెలుస్తోంది. ఎమ్మెల్యేలందరూ గురువారం ఉదయం హైదరాబాదులో అందుబాటులో ఉండాలని మంత్రులు ఆదేశించినట్టు సమాచారం. `ఏ పరిస్థితికి అయినా` వారు రెడీగా ఉండాలనేది ఫోన్ సంభాషణల సారాంశంగా చెప్తున్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీని రద్దు చేయనున్నారని, అనంతరం ఈ నెల 7 నుండి సీఎం కేసీఆర్ నియోజకవర్గాల్లో ప్రచార సభలు చేయనున్నారని టీఆర్ ఎస్ వర్గాల సమాచారం.