Begin typing your search above and press return to search.
కేటీఆర్ ను పండనీయొద్దన్న కేసీఆర్
By: Tupaki Desk | 12 April 2016 4:20 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాలు ఎలా ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. విషయం ఏదైనా కానీ తనదైన శైలిలో చెప్పే ఆయన.. మాట్లాడుతూ ఉంటే.. మరికాసేపు మాట్లాడితే బాగుండన్న భావన వ్యక్తమవుతోంది. సరిగ్గా ఇలాంటి అనుభవమే మరోసారి ఎదురైంది. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లకు మూడు రోజుల పునశ్చరణ కార్యక్రమాన్ని ప్రగతి రిసార్ట్స్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. కార్పొరేటర్లను ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించిన కేసీఆర్ ప్రసంగంలో బోలెడన్ని విశేషాలు ఉన్నాయని చెప్పాలి.
సమయం.. సందర్భాన్ని చూసుకొని.. తర తమ బేధాల్ని వదిలేసి.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి.. విశాల దృక్ఫదం ఉన్న నేతగా ఆయన చెప్పిన మాటలు విన్నప్పుడు కేసీఆర్ దృష్టి కోణానికి సలాం చేయాల్సిందే. రాజకీయాలు వేరు. కానీ.. రాజకీయం ఎలా చేస్తే బాగుంటుందన్న విషయాన్ని కేసీఆర్ చెబుతుంటే.. ఇలాంటి విజన్ ఉన్న నాయకుడ్ని ఇంతకాలం మిస్ అయ్యామనే భావన కలగక మానదు. కార్పొరేటర్లలో స్ఫూర్తిని పెంచటమే కాదు.. హైదరాబాద్ ను వారు ఎలా చేయాలన్న విషయానికి సంబంధించి తన ఐడియాలజీని ఓపెన్ చేసిన తీరు ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. తన శైలికి భిన్నంగా కార్పొరేటర్లను ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు.
రివ్యూ సమావేశాల్లో సుదీర్ఘంగా మాట్లాడే కేసీఆర్.. బహిరంగ సభల విషయంలో ఆయనకు ఒక లెక్క ఉంటుంది. కొలత కొలిచినట్లుగా కొంత సమయం పెట్టుకొని అక్కడితే ముగించేస్తారు. అరే.. కేసీఆర్ మరికాసేపు మాట్లాడితే బాగుండన్న భావన కలిగేలా చేస్తారు. తాజాగా కార్పొరేటర్లను ఉద్దేశించి చేసిన స్పీచ్ ను సుదీర్ఘంగా సాగించటమే కాదు.. ‘‘బోర్ కొట్టిస్తున్నానా?’’ అంటూ తనకు తానే ప్రశ్న అడిగిన తీరుకాస్త కొత్తగా ఉందనే చెప్పాలి.
కార్పొరేటర్లకు చాలా చెప్పాలన్న ధోరణి కేసీఆర్ మాటల్లో వ్యక్తమైంది. ఆయనేం చెప్పారన్న విషయాల్ని చెప్పుకుంటూ పోతే కనీసం పది పేజీల సమాచారం చెప్పాల్సిందే. కానీ.. ఆ మొత్తం సమాచారాన్ని పది ముక్కల్లో చెప్పాలంటే.. హైదరాబాద్ రూపురేఖల్ని మార్చటానికి ఏం చేయాలి? అందుకు తానేం చేయాలనుకున్న విషయాన్ని.. రాష్ట్ర ప్రభుత్వ కమిట్ మెంట్ ను చెప్పటమే కాదు.. ఒకే పార్టీ అయినప్పటికీ.. గ్రేటర్ ప్రయోజనాల కోసం అవసరానికి తగ్గట్లు రాష్ట్ర ప్రభుత్వంపై కూడా పోరాటం చేయాలంటూ కేసీఆర్ చెప్పిన తీరు సరికొత్తగా ఉంటుంది.
గ్రేటర్ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ.. ఎలాంటి మొహమాటాలకు గురి కాకుండా కార్పొరేటర్లు.. మేయర్ వ్యవహరించాలని.. కొన్ని విషయాల్లోరాష్ట్ర సర్కారుతో సైతం కోట్లాడాలని.. అదేమీ తప్పు కాదంటూ కేసీఆర్ చెప్పిన మాటలు.. మరే రాజకీయ నేత నోటి నుంచి రావేమో..? ఒక విశాల దృక్ఫదం ఉన్న నేత ఐడియాలజీ ఎలా ఉంటుందనటానికి సోమవారం కేసీఆర్ చేసిన ప్రసంగం ఓ చక్కటి ఉదాహరణగా చెప్పాలి. కేసీఆర్ చెప్పిన మాటలన్నీ.. ఆయన స్వయంగా చేస్తారా? లేదా? అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఈ తరహా ఐడియాలజీ కూడా ఇప్పటి అధినేతల్లో ఎక్కడా కనిపించదు.
తన ప్రసంగంలో భాగంగా కొడుకు కమ్ మంత్రి అయిన కేటీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య ఒకటి ఆకట్టుకుంటుంది. గ్రేటర్ కార్పొరేటర్లు.. మేయర్లు తమ పనుల్లో భాగంగా అధికారయంత్రాగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించాలని.. హైదరాబాద్ ను మార్చాల్సింది చాలానే ఉందన్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖా మంత్రి (కేటీఆర్)ని తిననీయొద్దు.. పండనీయొద్దు.. ఉరుకులు పరుగులు పెట్టించండి.. పనులు ఒత్తిడి చేసి మరీ పనులు చేయించుకోండంటూ కేసీఆర్ చెప్పిన మాటలు ఆసక్తికరంగానే కాదు.. ఆలోచించేలా ఉంటాయనటంలో మరెలాంటి సందేహం లేదు. ఏమైనా పని విషయంలో మిగిలిన వారి మాదిరే కొడుకు కూడా అన్న విషయాన్ని స్పష్టం చేయటమే కాదు.. అభివృద్ధి కోసం ఎవరి దగ్గరా మొహమాట పడొద్దన్న కేసీఆర్ మాటలు గ్రేటర్ నేతల మీద ఎంత ప్రభావం చూపిస్తాయో చూడాలి.