Begin typing your search above and press return to search.

గ్రేటర్ లో స్వయంగా రంగంలోకి కేసీఆర్

By:  Tupaki Desk   |   19 Nov 2020 5:00 PM GMT
గ్రేటర్ లో స్వయంగా రంగంలోకి కేసీఆర్
X
దుబ్బాక ఓటమితో జీహెచ్ఎంసీ ఎన్నికలపై నజర్ పెట్టిన కేసీఆర్ కసిగా ఎన్నికలను ప్రకటించి అంతే కసిగా గెలువాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ లో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడగొట్టాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి కీలక నేతలను ఎన్నికల ప్రచార బరిలోకి దింపారు. గ్రేటర్‌‌ ఎన్నికల్లో బీజేపీని అంత ఈజీగా తీసుకోవద్దని ఫిక్స్‌ అయ్యారు కేసీఆర్‌‌.

గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేయాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. కేటీఆర్ రోడ్ షోలు చేయాలని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. వారం రోజులపాటు విస్తృతంగా పర్యటించనున్నారు. ఫినిషింగ్ టచ్‌గా కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున భారీ బహిరంగసభలో ప్రసంగించే ఏర్పాట్లను టీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో ఈ సభ జరిగే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రమాదకరంగా మారుతుండటం.. ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు గుర్తించే ప్రమాదం ఏర్పడటంతో.. కేసీఆర్ కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

గ్రేటర్‌‌లో ఎంఐఎంతో టీఆర్‌‌ఎస్‌కు సహజంగానే అవగాహన ఉంది. ఎంఐఎంకు కాస్త పోటీ వచ్చే చోట.. హిందూ ఓట్లను చీల్చేందుకు కేసీఆర్ అభ్యర్థులను నిలుపుతున్నారు. మైనార్టీ ఓట్లు టీఆర్ఎస్‌కు పడాల్సిన చోట.. ఎంఐఎం అభ్యర్థులను నిలపదు. అదే సమయంలో.. బీజేపీ గెలిస్తే.. మత కల్లోలాలు జరుగుతాయన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలే వ్యూహంతో కేసీఆర్ ప్రచార కార్యక్రమాన్ని సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలోనూ ప్రతిపక్ష పార్టీలకు కౌంటర్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు.

కేసీఆర్‌‌ ప్రచారంలోకి వస్తే వార్ వన్ సైడ్ గా ఉంటుందన్న ధీమా గులాబీ పార్టీలో వ్యక్తమవుతోంది.. ఆయన నేరుగా ఎప్పుడూ ఓట్లు అడగరు. చెప్పాల్సిందంతా చెప్పి ప్రజలే తేల్చుకోవాలని చాయిస్ ఇస్తారు. ఆ చాయిస్ ప్రజలను ఆలోచింప చేస్తుంది. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్.. రాజకీయ సభల్లో ప్రసంగించింది లేదు. ఇప్పుడు ఒక్క సభ అయినా గ్రేటర్ ఎన్నికల్లో పెట్టాలని గులాబీ బాస్ నిర్ణయించడం ఆసక్తి రేపుతోంది.