Begin typing your search above and press return to search.

ఓకే అనే వ‌ర‌కూ ఆ మంత్రులిద్ద‌రూ వ‌ద‌ల్లేద‌న్న కేసీఆర్‌!

By:  Tupaki Desk   |   19 July 2019 6:15 AM GMT
ఓకే అనే వ‌ర‌కూ ఆ మంత్రులిద్ద‌రూ వ‌ద‌ల్లేద‌న్న కేసీఆర్‌!
X
మున్సిప‌ల్ బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సుదీర్ఘంగా ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా దేశ తొలి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూను పొగిడేశారు. సంద‌ర్భానికి త‌గిన‌ట్లుగా ఎవ‌రిని తిడ‌తారో.. ఎవ‌రిని తిట్ట‌ర‌న్న‌ది కేసీఆర్ కు మాత్ర‌మే అర్థ‌మ‌వుతుంది. తాజాగా మోడీ మీద గుర్రుగా ఉన్న ఆయ‌న‌కు నెహ్రూ నిర్ణ‌యాలు చ‌క్క‌గా అనిపించ‌టాన్ని త‌ప్పు ప‌ట్ట‌లేం.

ఈ రోజు స‌భ ఆమోదించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉన్న మున్సిప‌ల్ బిల్లులో కీల‌క‌మైన అంశాన్ని క‌చ్ఛితంగా పెట్టాల‌ని త‌న మంత్రులు శ్రీ‌నివాస్ గౌడ్‌.. మ‌ల్లారెడ్డిలు ప‌ట్టుప‌ట్ట‌టంతోనే పెట్టిన‌ట్లుగా చెప్పారు. ఈ సంద‌ర్భంగా వారికి ఇవ్వాల్సిన క్రెడిట్ వారికి ఇచ్చేశారు. రాష్ట్రంలో ఎక్క‌డైనా స‌రే 75 గ‌జాల వ‌ర‌కు స్థ‌లంలో నిర్మించే జీ ప్ల‌స్ వ‌న్ గృహానికి ఎలాంటి అనుమ‌తులు అక్క‌ర్లేద‌న్నారు.

అదే స‌మ‌యంలో 76 గ‌జాల్లో నిర్మించినా ప‌ర్మిష‌న్ ఉండాల్సిందేన‌న్నారు. అంతేకాదు.. ఈ ఇంటికి ఏడాదికి వంద రూపాయిలు మాత్ర‌మే ప‌న్ను విధిస్తామ‌ని.. రిజిస్ట్రేష‌న్ కూడా ఒక్క‌రూపాయే అంటూ ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు ప్ర‌క‌టించారు.

అయితే.. ఈ నిర్ణ‌యానికి కార‌ణం త‌మ మంత్రులు ఇద్ద‌రేన‌ని ప్ర‌శంసించారు. మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ గా గ‌తంలో ప‌ని చేసిన మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ కు చాలా అనుభ‌వం ఉంద‌ని.. మ‌ల్లారెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నో మున్సిపాలిటీలు ఉన్న విష‌యాన్ని కేసీఆర్ ప్ర‌స్తావించారు.

మొత్తానికి త‌నను మంత్రులు ఒత్తిడి చేయ‌గ‌ల‌ర‌ని.. త‌న నిర్ణ‌యాన్ని మార్చుకునే వ‌ర‌కూ విడిచిపెట్ట‌ర‌న్న విష‌యాన్ని కేసీఆర్ చెప్ప‌క‌నే చెప్పేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఫ‌ర్లేదు.. మంత్రుల‌కు కేసీఆర్ ద‌ర్శ‌న భాగ్యం క‌ల‌గ‌ట‌మే కాదు.. ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాల్లో మార్పులు చేసేంత యాక్టివ్ గా ప‌ని చేస్తున్న వైనం కేసీఆర్ పుణ్య‌మా అని తెలంగాణ ప్ర‌జానీకానికి తెలిసింద‌ని చెప్పాలి.