Begin typing your search above and press return to search.
కేసీఆర్ టెక్నాలజీ ముందు బ్యాంకులు దిగదుడుపే
By: Tupaki Desk | 17 Jan 2018 11:43 AM GMTటీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే భారీతనానికి మారుపేరు. కార్యక్రమం ఏదైనా అందులో తన మార్క్ ఉండాలని ఆయన తపిస్తుంటారు - అమలు చేస్తుంటారు కూడా! అలాంటి కాంక్ష కలిగిన కేసీఆర్ మరో రికార్డుకు సిద్ధమయ్యారు. అది కూడా అలాంటి ఇలాంటి రికార్డ్ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఎవరూ చేయని రికార్డు. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటంటే...భూ రికార్డుల ప్రక్షాళన - కొత్త పాస్ పుస్తకాల పంపిణి. ఇందుకు ఆయన అవలంబిస్తున్న టెక్నాలజీ.
భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించిన రాష్ట్ర ప్రభుత్వం, సవరించిన రికార్డుల మేరకు రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందించేందుకు రంగం సిద్ధంచేసింది. మార్చి 11వ తేదీన ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బ్యాంకులు రైతులకు రుణాలిచ్చేందుకు ఇకపై పట్టాదార్ పాస్ పుస్తకాలు తనఖా పెట్టుకోరాదని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పలు కార్యక్రమాలు, ఇటీవల పూర్తయిన భూ రికార్డుల ప్రక్షాళన - పంచాయతీరాజ్ కొత్త చట్టం - పంచాయతీలకు ఎన్నికలు తదితరాలపై ప్రగతిభవన్ లో ఏర్పాటుచేసిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లు - జాయింట్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. పట్టుబట్టి పనిచేస్తే పరిశుభ్రమైన - అభివృద్ధికరమైన గ్రామీణ తెలంగాణను సాధించుకోగలమని సీఎం ఉద్బోధించారు. అసాధారణమైన పనులుచేసే శక్తియుక్తులు - దేన్నైనా సాధించే పట్టుదల రాష్ర్టానికి ఉందన్న సీఎం.. ఒకే రోజులో సమగ్ర కుటుంబ సర్వే - తక్కువకాలంలో కరంటు కష్టాలను అధిగమించడం, తాగునీటి సమస్యకు పరిష్కారం కనుగొనడంవంటి కార్యక్రమాలను ఉదహరించారు.
కోర్ బ్యాంకింగ్ తో సమానమైన టెక్నాలజీని పాస్ పుస్తకాల జారీకి కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ``రెవెన్యూ రికార్డుల నిర్వహణలో మార్చి 12నుంచి విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఇంతవరకు ఈ దిశగా జరిగినదంతా స్థిరపడాలి. ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ల శాఖ ఉండాల్సిన అవసరం లేదు. మొత్తం రాష్ట్రంలో రోజువారీగా జరిగే రిజిస్ట్రేషన్లు రెండున్నర వేల నుంచి నాలుగు వేల వరకు ఉంటాయి. ఇందులో 60% పట్టణ ప్రాంతాల్లో - 40% గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. ఇక ముందు ఇప్పుడున్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అదనంగా 443 మండల కార్యాలయాలు కూడా రిజిస్ట్రేషన్ వ్యవహారాలు చూస్తుంటాయి. మొత్తం 584 మండలాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలుంటాయి. రిజిస్ట్రేషన్ తర్వాత మ్యుటేషన్ కు నెలల కొద్దీ సమయం పట్టాల్సిన అవసరం ఇక ముందు ఉండదు. మార్చి 12 నుంచి కోర్ బ్యాంకింగ్ నెట్ వర్క్ తరహా విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. కొనుగోలుదారు - అమ్మకందారు పాస్ పుస్తకాల్లో తక్షణమే ఎంట్రీలు - మార్పులు - చేర్పులు నమోదవుతాయి. దీనికోసం ఎక్కువ సామర్థ్యం కల కంప్యూటర్లు - సర్వర్లు ఏర్పాటుచేస్తున్నాం. ఇద్దరికీ పాస్ పుస్తకాలు కొరియర్ ద్వారా వారి ఇండ్లకే పంపుతాం. ధరణి వెబ్ సైట్ లో వెంటనే అప్ డేట్ అవుతుంది. ధరణి వెబ్ సైట్ ను ప్రపంచంలో ఏ మూలనుంచైనా చూడవచ్చు.`అని కేసీఆర్ వివరించారు.