Begin typing your search above and press return to search.
'6' వచ్చేలా బడ్జెట్ ప్రసంగం షురూ చేసిన కేసీఆర్
By: Tupaki Desk | 22 Feb 2019 7:00 AM GMTముఖ్యమంత్రే బడ్జెట్ ను ప్రవేశ పెట్టటం కొత్తేం కాదు కానీ.. చాలా తక్కువ సందర్భాల్లోనే ఇలాంటి పరిస్థితి నెలకొంది. గతంలో కాసు బ్రహ్మానందరెడ్డి.. ఆ తర్వాత కొణిజేటి రోశయ్యలు ఇద్దరు మాత్రమే సీఎంలుగా ఉంటూ బడ్జెట్ ను ప్రవేశ పెట్టటం జరిగింది. ఇప్పుడా వరుసలోకి కేసీఆర్ చేరారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరో బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్న కేసీఆర్ సర్కారు.. 2019-20 ఓటాన్ బడ్జెట్ ను కేసీఆర్ ప్రవేశ పెట్టారు. బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టే సమయంలో కేసీఆర్ తనకు అత్యంత ఇష్టమైన.. సెంటిమెంట్ గా భావించే ఆరు అంకె ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. అదెలానంటే.. 11.30కు సభ ప్రారంభమైనప్పటికీ.. పుల్వామా ఉగ్ర ఘటనను ఖండించటం.. ఆ తర్వాత సభ వాయిదా పడటం జరిగింది.
తర్వాత సభ ప్రారంభమైన తర్వాత సరిగ్గా.. 12.12 గంటల వేళలో కేసీఆర్ తన బడ్జెట్ ప్రసంగాన్ని షురూ చేశారు. 12.12 మొత్తాన్ని కలిపితే కేసీఆర్ కు అదృష్ట సంఖ్యగా చెప్పే ఆరు అంకె వస్తుంది. ఇలా.. తాను తొలిసారి ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను తనకు కలిసి వచ్చే సంఖ్య వేళలోనే బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.