Begin typing your search above and press return to search.
రైతుబంధుకు కోత పెట్టేస్తున్న గులాబీ సారు
By: Tupaki Desk | 31 Aug 2019 4:34 AM GMTతన కలల పథకంగా చెప్పుకునే రైతుబంధు పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సరికొత్త కోత పెడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తన మానసపుత్రికగా రైతుబంధు పథకాన్ని కేసీఆర్ చెబుతుంటారు. తాను స్టార్ట్ చేసిన ఈ పథకాన్ని కేంద్రం సైతం కాపీ కొట్టిందన్న మాట ఆయన నోటి నుంచి పలుమార్లు వచ్చింది. వ్యవసాయం సమస్యల మయంగా మారిన వేళ.. పంట పండించే రైతుకు ఆర్థిక దన్నును ఇచ్చేలా.. వ్యవసాయానికి సాయంగా ఉంటుందన్న పేరుతో స్టార్ట్ చేసిన రైతుబంధు పథకానికి మార్పులు చేసే దిశగా కేసీఆర్ సర్కారు అడుగులు వేస్తోంది.
ఏటా ఎకరానికి రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం అందించటం ద్వారా.. వ్యవసాయం చేసే రైతు సమస్యలకు అసరాగా ఉండేలా ఈ పథకాన్ని ప్లాన్ చేశారు. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ఎంత భూమి అంటే అంత మొత్తానికి పథకాన్ని అమలయ్యేలా చేశారు. అయితే.. ఈ పథకం కారణంగా రాష్ట్ర బడ్జెట్ లో భారీ మార్పులు చేసుకోవటం.. ఈ బడ్జెట్ భారీగా ఉండటంతో ఇతర సంక్షేమ పథకాలకు.. ఇతరత్రా పథకాలకు నిధుల సమస్య ఇబ్బందిగా మారింది.
దీనికి తోడు కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టుకు పెట్టాల్సిన ఖర్చు తడిచి మోపెడు అవుతున్న వేళ.. మాంద్యం కారణంగా నిధుల కొరతను ఎదుర్కొంటోంది తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల కారణంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారిందన్న మాట వినిపిస్తోంది ఇదిలా ఉంటే.. ఈ ఏడాది భారీ సాగునీటి ప్రాజెక్టులు.. సంక్షేమ పథకాలకు భారీగా నిధులు సమకూర్చాల్సిన వేళ.. సరికొత్త కోతలకుతెర తీయాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.
ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయటానికి అవసరమైతే భూములు అమ్మి అయినా పూర్తి చేస్తామని సగర్వంగా ప్రకటించిన సారు.. తాజాగా ఎదుర్కొంటున్న నిధుల కొరతను అధిగమించటానికి వీలుగా రైతుబంధు పథకానికి కోత పెట్టనున్నారు. ఈ పథకాన్ని స్టార్ట్ చేసిన తొలి ఏడాది ఎకరానికి రూ.8 వేల నుంచి రూ.10వేలు చేయటం తెలిసిందే. తాజాగా తీసుకున్నట్లుగా చెబుతున్న నిర్ణయం ప్రకారం.. ఏ రైతు అయినా సరే.. పది ఎకరాల వరకూ మాత్రమే రైతుబంధు సాయాన్ని అందిస్తారు తప్పించి అంతకు మించి ఇవ్వరు.
రైతుబంధు పథకానికి పది ఎకరాల సీలింగ్ పెట్టటం ద్వారా.. ఖర్చును కాస్త తగ్గించుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రైతుబంధు పథకానికి పది ఎకరాల సీలింగ్ పెట్టటం ద్వారా దాదాపు రూ.500 కోట్ల వరకూ రాష్ట్రానికి మిగిలే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే నిధుల కొరతతో కిందామీదా పడుతున్న ప్రభుత్వానికి తాజా నిర్ణయం అంతో ఇంతో ఉపశమనం కలిగేలా చేస్తుందంటున్నారు. మరి.. ఈ నిర్ణయాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.