Begin typing your search above and press return to search.
లక్షల కోట్లు కాదు.. లక్షణంగా కేసీఆర్ పెట్టేశారు..
By: Tupaki Desk | 9 Sep 2019 6:54 AM GMTదాదాపు రెండు లక్షల కోట్లు.. తెలంగాణ ప్రభుత్వ కొలువైన కొత్తల్లో తెలంగాణ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ మొత్తమిదీ.. ఆదాయం ఉందో లేదో.. ఆశించిన నిధులు ఉన్నవో లేవో కానీ.. 2014లో గెలిచాక తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబులు రెండు తెలుగు రాష్ట్రాల బడ్జెట్ ను అటూఇటూగా రెండు లక్షల కోట్లకు చేర్చారు. అయితే అంత ఖర్చు పెట్టింది లేదు.. నిధులు రెండు లక్షల కోట్లకు వచ్చింది లేదు. రెవెన్యూ లోటుతో చాలా బొక్కపడింది.
అయితే ఈసారి మాత్రం కేసీఆర్ గాలిలో మేడలు కట్టడం లేదు. వాస్తవంలోకి వచ్చారు. దేశాన్ని ఆర్థికమాంద్యం చుట్టుముట్టడం.. తెలంగాణ ప్రభుత్వం వద్ద ఇప్పటికే 27535 కోట్ల బిల్లులు పెండింగ్ లో పడిపోయాయి. ఆ బిల్లులు అన్నీ చెల్లించకపోవడంతో తరుముకొస్తున్న విపత్తకు అనుగుణంగా తెలంగాణ సర్కారు పూర్తి స్థాయి బడ్జెట్ లెక్కను వాస్తవిక కోణంలోనే రూపొందించడం విశేషం.. ఈ రోజు 11.30 గంటలకు తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబడుతుంది.
2019-20 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ ను అక్షరాల 1.65 లక్షల కోట్లకే పరిమితం చేయడం విశేషం. లెక్కల మాయ చేయకుండా ఆర్థికమాంద్యంను పరిగణలోకి తీసుకొని ఈ బడ్జెట్ ను రూపొందించినట్టు తెలిసింది. నిన్న మంత్రివర్గం ఆమోదించింది. శాసనమండలిలో హరీష్ రావు - శాసనసభలో కేసీఆర్ ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం ఇటీవలే బడ్జెట్ పెట్టడం.. తెలంగాణకు ఎన్ని నిధులు వస్తాయనే విషయంలో క్లారిటీ రావడంతో వాస్తవిక లెక్కలతోనే కేసీఆర్ బడ్జెట్ ను గొప్పలకు పోకుండా కేవలం 1.65 లక్షల కోట్లకే పరిమితం చేయడం గమనార్హం. అంతకుముందు 2 లక్షల కోట్ల వరకు తెలంగాణ బడ్జెట్ ఉండేది. కానీ కేసీఆర్ ఈసారి 1.65 లక్షలకే పద్దు లెక్క చెప్పబోతున్నారు. ఇందులో సాగునీటి రంగం - విద్యుత్ - వ్యవసాయ రంగం - సంక్షేమంలకు ఎక్కువ కేటాయింపులు చేసినట్లు సమాచారం.