Begin typing your search above and press return to search.
గవర్నర్ కు కేసీఆర్ ‘కొత్త’ సంకటం
By: Tupaki Desk | 20 Sep 2016 6:49 AM GMTరెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా గవర్నర్ బాధ్యతులు నిర్వర్తిస్తున్న గవర్నర్ నరసింహన్ కు కొత్త సంకటం ఒకటి ఎదురైనట్లుగా తెలుస్తోంది. జెట్ స్పీడ్ తో కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఏది ఏమైనా.. దసరా నాటికి కొత్త జిల్లాలు వచ్చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 10 జిల్లాలు ఉంటే.. వచ్చే నెల 11 (దసరా) నాటికి 17 కొత్త జిల్లాల్ని అధికారికంగా ప్రారంభించాలని భావిస్తున్నారు. దీంతో.. తెలంగాణలో 27 జిల్లాలుగా మారనుంది.
అయితే.. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో రాజకీయ పక్షాలు పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలకు తగ్గట్లేవివిధ వర్గాలకు చెందిన వారు సైతం కొత్త జిల్లాల ఏర్పాటుపై పలు విమర్శలు చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు చట్టబద్ధత లేదన్న మాట కూడా వినిపిస్తోంది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసే అవకాశమే లేదన్న మాటను చెబుతున్నారు తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం మాష్టారు. నిబంధలు ఒక్కటే కాదు.. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ఏ అంశాన్ని సరైన ప్రాతిపదికన లేకుండానే కొత్త జిల్లాల ఏర్పాటు ఉందని విమర్శలు గుప్పించారు.
ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం అవేమీ పట్టించుకోకుండా.. కొత్త జిల్లాల్ని ప్రారంభించటానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓపక్క నిరసనలు.. మరోపక్క ఏర్పాట్లతో చిత్రమైన వాతావరణం తెలంగాణలో నెలకొని ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే డిసైడ్ చేసిన జిల్లాలు కాకుండా మరికొన్ని కొత్త జిల్లాలకు సంబంధించిన డిమాండ్లు జోరుగా వినిపిస్తున్నాయి. వాటి విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా గవర్నర్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కొత్త జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా ఆయన్ను కోరారు. తరచూ గవర్నర్ ను కలుసుకొంటూ.. పాలనా పరమైన సమాచారాన్ని.. కొన్ని అంశాలకు సంబంధించి ఫీడ్ బ్యాక్ కోసం గవర్నర్ తో భేటీ అవుతుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. తాజాగా ఆయనతో రెండు గంటలకు పైనే భేటీ అయిన కేసీఆర్.. కొత్త జిల్లాల ప్రారంభోత్సవంలో పాల్గొనాలని కోరినట్లుగా చెబుతున్నారు. తాను సిద్ధిపేట జిల్లాను ప్రారంభిస్తున్నట్లు చెప్పిన కేసీఆర్.. గవర్నర్ కూడా ఏదైనా జిల్లాను ప్రారంభించాలని కోరినట్లుగా తెలుస్తోంది. అయితే.. దీనిపై గవర్నర్ స్పందించలేదని చెబుతున్నారు.కొత్త జిల్లాల ఏర్పాటుపై బీజేపీతో సహా మిగిలిన పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్న వేళ.. గవర్నర్ కొత్తజిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది. కేసీఆర్ ఆహ్వానాన్ని మన్నించి కొత్త జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొంటే.. కొత్త జిల్లాల్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. చూస్తూ.. చూస్తూ కేంద్రంలోని అధికారపక్షం ఆగ్రహానికి గురయ్యేందుకు గవర్నర్ అవకాశం ఇస్తారా? అన్నది ప్రశ్న