Begin typing your search above and press return to search.
బావకు నో.. బామ్మర్దికి ఓకే!
By: Tupaki Desk | 19 Dec 2017 5:11 AM GMTకేసీఆర్.. ప్రపంచ తెలుగు మహాసభలను కూడా తన ఇంట్లో శుభకార్యం లాగానే నిర్వహించి ఉండవచ్చు గాక.. ప్రోటోకాల్ ప్రాధాన్యాలతో నిమిత్తం లేకుండా.. తనకు ఇష్టం వచ్చిన వారిని మాత్రమే కార్యక్రమానికి ఆహ్వానించి.. ఆ రకంగా తాను మోనార్క్ నే అని చాటుకుని ఉండవచ్చు గాక.. కానీ.. అందులో కూడా కొంత విలక్షణత పాటిస్తున్నారు. తెలుగు మహా సభలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆహ్వానించలేదనే విషయంలో.. నిజానికి ఏపీ లోని బాబు అభిమానులు - తెదేపా నాయకులు గుర్రుగానే ఉన్నారు. కనీసం పిలవకపోవడం ఖచ్చితంగా చంద్రబాబును అవమానించడమే. అయితే.. ఆయనకు బామ్మర్ది బాలకృష్ణను మాత్రం తెలుగు సభలకు ప్రముఖంగా ఆహ్వానించడం ద్వారా.. కేసీఆర్ తన శైలిని నిరూపించుకున్నారు.
సోమవారం తెలుగు సభల్లో సినీ సభలు జరిగిన సందర్భంలో.. వేదిక మీద ఏపీలోని ఎమ్మెల్యే - చంద్రబాబు బామ్మర్ది ప్లస్ వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ కూడా అతిథిగా పాల్గొన్నారు. దీనిని చూసిన వారు మాత్రం.. బావకు నో చెప్పారు గానీ.. బామ్మర్దిని మాత్రం అందలం ఎక్కించి కూర్చోపెట్టారని వ్యాఖ్యానించడం విశేషం.
నిజానికి బాలకృష్ణకు కేసీఆర్ తో చాలా సత్సంబంధాలే ఉన్నాయి. గతంలో బాలయ్య సినీ ఫంక్షన్లకు కూడా కేసీఆర్ హాజరయ్యారు. బాలయ్య అంటే తనకు ఉన్న అభిమానం గురించి కూడా చెప్పుకున్నారు. అలాగే.. ఆయన నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రానికి పన్ను రాయితీలు కూడా ఇచ్చారు. ఇలా ప్రతి సందర్భంలోనూ బాలయ్యతో కేసీఆర్ కు ఉన్న సత్సంబంధాలు తెలుస్తూనే ఉన్నాయి.
తాజా పరిణామాలు కూడా ఇందుకు మరో నిదర్శనం లాగానే ఉన్నాయని.. నందమూరి బాలకృష్ణను సగౌరవంగా ఆహ్వానించడం ద్వారా.. తెలుగుదేశం నాయకులు కేసీఆర్ వైఖరిని తిట్టాలో సమర్థించాలో కూడా వారికే అర్థంకాని పరిస్థితిని కల్పించారని పలువురు అనుకుంటున్నారు.
అయితే.. చంద్రబాబును పిలవకపోవడం గురించి మరోజోకు కూడా చెలామణీ అవుతోంది. ఆయనను పిలిచేవారే గానీ.. ఏదో భాష గురించి నాలుగు మాటలు చెప్పకుండా.. అసలు భాషకు గౌరవం ఇచ్చే క్రెడిట్ మొత్తం నాదే.. గతంలో నేను చేసిందే ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నారంటూ.. ఎక్కడ క్రెడిట్ హైజాక్ చేసేస్తారో అనే ఉద్దేశంతోనే పక్కన పెట్టినట్లుగా పుకార్లున్నాయి. ప్రతి విషయంలోనూ తాను మాత్రమే.. పనిమంతుడిని అన్నట్లుగా డాంబికాలు చెప్పుకునే చంద్రబాబు ధోరణే.. ప్రస్తుతం ఈ తిరస్కారాలకు కారణం అని అనుకుంటున్నారు.