Begin typing your search above and press return to search.

ప్ర‌ధమ పౌరుడికి యాగం ఇన్విటేష‌న్‌ ఇచ్చేశారు

By:  Tupaki Desk   |   28 Oct 2015 10:15 AM GMT
ప్ర‌ధమ పౌరుడికి యాగం ఇన్విటేష‌న్‌ ఇచ్చేశారు
X
డిసెంబ‌రులో నిర్వ‌హించనున్న అయుత చండీయాగానికి మొద‌టి ఇన్విటేష‌న్ ను దేశ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంద‌జేశారు. తెలంగాణ ప్రాంత‌మంతా సుఖ‌శాంతుల‌తో.. ప్ర‌జ‌లు క‌ష్ట‌న‌ష్టాలు ఎదుర్కోకుండా ఉండాల‌ని కోరుతూ చండీయాగాన్ని చేయాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి నిర్ణ‌యించ‌టం తెలిసిందే.

ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న ఈ యాగానికి దేశ రాష్ట్రప‌తిని.. ప్ర‌ధానిని అతిధులుగా ఆహ్వానించాల‌ని భావించారు. ఇందులో భాగంగా బుధ‌వారం మ‌ధ్యాహ్నం రాష్ట్రప‌తిని క‌లిసి కేసీఆర్‌.. ఆయ‌న్ను చండీయాగానికి రావాల‌ని ఆహ్వానించారు. మ‌రోవైపు ప్ర‌ధాని మోడీని క‌లిసేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికి సాధ్యం కాలేదు. దీంతో.. ఆయ‌న గురువారం మ‌ధ్యాహ్నానికి హైద‌రాబాద్ రావాల్సి ఉన్నా.. బుధ‌వారం రాత్రికే తిరిగి వ‌చ్చేయ‌నున్నారు.

రాష్ట్రప‌తికి ఇన్విటేష‌న్ ఇవ్వ‌టం ద్వారా చండీయాగానికి సంబంధించిన ప‌నులు అధికారికంగా మొద‌లైన‌ట్లేన‌ని చెప్పొచ్చు. తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న ఈ చండీయాగాన్ని కేసీఆర్ త‌న సొంత వ్య‌వ‌సాయ క్షేత్రంలో నిర్వ‌హిస్తుండ‌టం విశేషం.మ‌రోవైపు చండీయాగంపై ప‌లువురు మేధావులు త‌ప్పు ప‌డుతున్నారు. ఒక‌వైపు రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుంటే.. వాటి ప‌రిష్కారం చూడ‌కుండా ఈ యాగాలేంట‌ని మండిప‌డుతున్నారు.