Begin typing your search above and press return to search.

ఆ మాటకు కేసీఆర్ ఇరిటేట్ అయ్యారు చూశారా?

By:  Tupaki Desk   |   26 March 2016 12:01 PM GMT
ఆ మాటకు కేసీఆర్ ఇరిటేట్ అయ్యారు చూశారా?
X
కొన్ని.. కొన్ని అంశాలు ఎంతలా ఇబ్బంది పెడతాయో.. మరెంతలా దెబ్బ తీస్తాయో ఉద్యమ నేతగా సుదీర్ఘంగా వ్యవహరించిన కేసీఆర్ కు తెలియంది కాదు. దేశంలో కొన్ని అంశాలకు ఉంటే భావోద్వేగం అంతాఇంతా కాదని.. అలాంటి విషయాలకు వీలైనంత దూరంగా ఉండటానికి మించింది మరొకటి లేదన్న విషయం తెలంగాణ ముఖ్యమంత్రికి తెలియంది కాదు. అందుకే... రోహిత్ ఇష్యూలో కానీ.. ఢిల్లీ జేఎన్ యూ కన్నయ్య ఎపిసోడ్ ను ఎంతమాత్రం టచ్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. నిజానికి అలాంటి విషయాల మీద ప్రస్తావన రాకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించటం తెలిసిందే.

రోహిత్ ఇష్యూ వెలుగు చూసిన మొదట్లో కేసీఆర్ కుమార్తె స్పందించి ఘాటుగా వ్యాఖ్యలు చేయటం.. ఆ తర్వాత ఆమె కామ్ గా ఉండటం వెనుక కేసీఆర్ ఇచ్చిన క్లాస్ పుణ్యమేనని చెప్పుకోవటం కనిపిస్తుంది. అలా ఆచితూచి వ్యవహరిస్తున్న ఆయన.. శనివారం రోహిత్.. కన్నయ్య ఇష్యూ మీద స్పందించక తప్పలేదు.

హెచ్ సీయూ.. జేఎన్ యూ ఘటనలు బాధాకరమని.. రోహిత్ ఆత్మహత్య తనను కలిచివేసిందని.. తానెంతో బాధ పడ్డానని చెప్పిన ఆయన.. విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామన్న హామీ ఇచ్చారు. ఈ రెండు ఇష్యూల మీద చర్చ జరుగుతున్న సమయంలో ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్నట్లుగా చెప్పుకునే మజ్లిస్ నేతలు చెలరేగిపోవటం.. కేసీఆర్ ను దళిత వ్యతిరేకి అన్న వ్యాఖ్యలు చేయటంతో కేసీఆర్ కు ఎక్కడ లేని చిరాకు వచ్చేసింది. తానెంత ఆచితూచి వ్యవహరిస్తున్నా.. చివరకు వచ్చేసరికి తనపై దళిత వ్యతిరేకి అన్న విమర్శ మీద పడటం.. అది కూడా తన మిత్రుడి నోటి నుంచి రావటంతో ఆయన ఇరిటేట్ కావటం స్పష్టంగా కనిపించింది.

సభలో ఏ విషయం మీదనైనా చర్చ జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించినా.. ఏదో వ్యాఖ్యలు చేయటం.. సంబంధం లేని నినాదాలు చేయటం సరికాదంటూ కేసీఆఱ్ మండిపడటం గమనార్హం. తనపై చేసే విమర్శల విషయంలో పెద్దగా పట్టించుకోనట్లుగా వ్యవహరించే కేసీఆర్.. ‘దళిత వ్యతిరేకి’ అన్న మాట వచ్చిన వెంటనే ఇరిటేట్ కావటం చూస్తే.. కేసీఆర్ బలహీనత ఏమిటో అర్థమైనట్లేనని చెప్పక తప్పదు.