Begin typing your search above and press return to search.

విద్యాశాఖ మొదలుపెట్టడంపై కేసీఆర్ కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   17 July 2020 4:00 AM GMT
విద్యాశాఖ మొదలుపెట్టడంపై కేసీఆర్ కీలక నిర్ణయం
X
తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి నీళ్లు, నిధులు, నియామకాల గురించే ఆలోచిస్తున్న కేసీఆర్ విద్యావ్యవస్థను.. నిరుద్యోగులు, ఉద్యోగులను పట్టించుకున్న దాఖలాలు లేవనే విమర్శలున్నాయి. కరోనా వైరస్ విజృంభణతో ఇప్పుడు మొత్తం విద్యావ్యవస్థనే తెలంగాణలో స్తబ్దుగా మారింది. దీంతో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ విద్యాశాఖపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రగతిభవన్ లో విద్యాశాఖపై జరిగిన సమీక్షలో కేసీఆర్ యూనివర్సిటీ పరీక్షలు, విద్యార్థుల ప్రమోట్ తదితర అంశాలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీనియర్ అధికారులతో సమాలోచనలు జరిపారు. విద్యావ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి, అమలు చేస్తామని కేసీఆర్ తెలిపారు. దీనికోసం విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాలని కేసీఆర్ ఆదేశించారు.

ఈ క్రమంలోనే ఇంజనీరింగ్ విద్యాసంవత్సరాన్ని ఆగస్టు 17నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. విద్యార్థులు విలువైన సంవత్సరాన్ని కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను రూపొందించాలని.. పాఠశాలల పున: ప్రారంభం.. విద్యాబోధన ఎలా జరగాలన్న అంశంపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని కేసీఆర్ చెప్పారు.

కస్తూర్బా పాఠశాలల్లో చదివే అనాథ పిల్లలు 10వతరగతి తర్వాత కూడా వారి చదువుల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని కేసీఆర్ వివరించారు.