Begin typing your search above and press return to search.

కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు:కుమార స్వామి

By:  Tupaki Desk   |   6 Oct 2022 4:05 AM GMT
కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు:కుమార స్వామి
X
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన భారత్ రాష్ట్ర సమితికి పలు రాష్ట్రాలకు చెందిన కీలక నేతల నుంచి మద్దతు లభిస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ కు ముందు నుంచి మద్దతు తెలుపుతున్న జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఈరోజు కేసీఆర్ తో జరిగిన సమావేశానికి కూడా హాజరయ్యారు. పలు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు ఈ సమావేశానికి హాజరైనట్టుగా తెలుస్తోంది.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు కుమారస్వామి పూర్తి మద్దతును ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తామని కుమారస్వామి వెల్లడించారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా కేసీఆర్ చేయబోయే పర్యటనల్లో జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆయన వెంట ఉంటారని చెప్పారు.

తెలంగాణ నుంచి ఒక జాతీయ పార్టీ ఆవిర్భవించడం హర్షనీయమని కుమార స్వామి అన్నారు. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, జాతీయస్థాయిలో బీఆర్ఎస్ విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.

కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని ఆయన కితాబిచ్చారు. అయితే, తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు జాతీయ స్థాయిలో ప్రభావం చూపాలని, అవి దేశమంతా అమలు చేయాల్సిన అవసరం ఉందని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. కాగా, ప్రగతి భవన్ లో కేసీఆర్ తో జరిగిన సమావేశానికి కుమారస్వామితోపాటు తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్ కూడా హాజరయ్యారు.

తన పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన వచ్చారు. వీరితో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ కు మద్దతుగా వచ్చిన పలువురు నేతలతో కేసీఆర్ అల్పాహారం చేసి బీఆర్ఎస్ పై చర్చించారు. అయితే, బీఆర్ఎస్ లో వీసీకే విలీనం కాబోతుందని ప్రచారం జరిగింది.

దాంతోపాటు, కర్ణాటకకు చెందిన మరో రెండు పార్టీలు, మహారాష్ట్రకు చెందిన ఒక పార్టీ కూడా బీఆర్ఎస్ లో విలీనం అవుతాయని పుకార్లు వస్తున్నాయి. అయితే, ఈ విషయంలో ఆయా పార్టీల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.