Begin typing your search above and press return to search.

మోడీ అంటే.. కేసీఆర్‌ కు భ‌యం: బీజేపీ ఎంపీ కీల‌క వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   23 April 2022 3:30 PM GMT
మోడీ అంటే.. కేసీఆర్‌ కు భ‌యం:  బీజేపీ ఎంపీ కీల‌క వ్యాఖ్య‌లు
X
బీజేపీకి వ్యూహ‌క‌ర్త‌లతో ప‌నిలేద‌ని ఆ పార్టీ కీల‌క నాయ‌కుడు, ఏపీకి చెందిన రాజ్య‌స‌భ‌స‌భ్యుడు.. జీవీఎల్ న‌ర‌సింహారావు అన్నారు. బీజేపీలో ఉన్న ప్ర‌తి నాయ‌కుడు.. వ్యూహ‌క‌ర్తేన‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే ఆంధ్రప్రదేశ్లో కేంద్ర మంత్రులు పర్యటించాను న్నారని తెలిపారు. ఈనెల 25, 26 తేదీల్లో కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, ధర్మేంద్ర ప్రధాన్, జయశంకర్ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు చెప్పారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ విజయనగరం జిల్లాలో, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ విశాఖపట్నం జిల్లాలో, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కడప జిల్లాలో పర్యటించానున్నారు.

విదేశాంగ, విద్యాశాఖల మంత్రుల పర్యటన తేదీలు త్వరలో ఖరారు కానున్నాయని తెలిపారు. కేంద్రం విస్తృతంగా సహాయం అందిస్తున్నా.. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలూ కేంద్రాన్ని విమర్శిస్తున్నాయన్నారు.

ఏపీ ప్రభుత్వం సబ్సిడీ బియ్యం ఎంత ఉచితంగా ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాక్షేత్రంలో రాష్ట్ర వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు. రాష్ట్ర సమస్యలను పార్లమెంట్లో తానే ప్రస్తావిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి రాష్ట్ర ప్రాజెక్టులకు ఇచ్చే నిధులు దారి మళ్ళకుండా దీర్ఘకాల ప్రయోజనాలు చేకూర్చే అంశాలకే నిధులు ఇవ్వాలని కోరనున్నట్లు వివరించారు.

ప్రజాస్వామ్యనికి కుటుంబ పార్టీల నుంచి ముప్పు పొంచి ఉందన్న జీవీఎల్.. కుటుంబ పార్టీల పాలన దూరం చేసేలా 2024 ఎన్నికల ఎజెండాను ప్రధాని ఖరారు చేస్తారన్నారు. పీకే కాంగ్రెస్ పార్టీలో చేరడం పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ సమర్థవంతంగా ఉందన్నారు. స్ట్రాటజిస్టుల అవసరం బీజేపీకి లేదన్న ఆయన బయటి వారిని తెచ్చుకుని రాజకీయ వ్యూహాలు రచించాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్నారు. ప్ర‌తి ఒక్క బీజేపీ నాయ‌కుడు ఒక వ్యూహ‌క‌ర్తేన‌ని చెప్పారు.

ఇక‌, తెలంగాణ గురించి మాట్లాడుతూ.. గ‌త కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో కంటే 8 రెట్లు మోడీ హ‌యాంలో ఎక్కువగా తెలంగాణకు కేంద్రం నిధులు ఇస్తోందని జీవిఎల్ అన్నారు. కేటీఆర్ హద్దు మీరి మోడీ మీద వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీ అంటే భయంతోనే కేసీఆర్‌ అలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని.. కేసీఆర్‌కు అప్పుడే భ‌యం ప‌ట్టుకుంద‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం అక్క‌డ బీజేపీ బాగానే పుంజుకుంద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అదికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని చెప్పుకొచ్చారు.