Begin typing your search above and press return to search.

అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు కేసీఆర్ రెడీ.. మరో సంచలనం ఖాయమా?

By:  Tupaki Desk   |   24 Nov 2022 4:03 PM GMT
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు కేసీఆర్ రెడీ.. మరో సంచలనం ఖాయమా?
X
కేంద్రంపై మరో పోరాటానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. కేంద్రం కల్పిస్తున్న ఆటంకాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు యోచిస్తున్నారు. కేంద్రం వల్లే ఈ కష్టాలన్నీ అని చెప్పేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు.

వచ్చేనెలలో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు పెట్టి కేంద్రం పెడుతున్న ఇబ్బందుల వల్ల తెలంగాణకు రావాల్సిన 40వేల కోట్లు రాకుండా పోతున్నాయని.. దీనివల్ల తెలంగాణ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రజలకు చెప్పాలని నిర్ణయించారు. కేంద్రం ఆంక్షలతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు రావాల్సిన ఆదాయంలో 40వేల కోట్ల రూపాయలకు పైగా తగ్గుదల చోటుచేసుకున్నది కేసీఆర్ అంచనావేశారు.ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిసెంబర్ లో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. రుణాలు తీసుకోకుండా కేంద్రం కట్టడి చేయడంతో తెలంగాణ వద్ద రూపాయి ఖజానా లేకుండా అవుతోంది. నిధుల సమస్య తెలంగాణను వేధిస్తోంది. ప్రతీనెల జీతాలు కూడా ఆలస్యమవుతున్నాయి. వచ్చే నెల కూడా పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయట..

ఈ ఆర్తిక సంవత్సరం తెలంగాణకు రుణాలు సరిగ్గా అందడం లేదు. ఎఫ్ఆర్బీఎం పరిమితికి అదనంగా కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేసినా వాటిని కూడా రాష్ట్ర అప్పులుగానే కేంద్ర ఆర్థిక కార్యదర్శి తెలంగాణకు సమాచారం ఇచ్చారు. కేంద్రంలాగా తెలంగాణ అప్పులు తీసుకుంటోందని.. రాజ్యాంగం ప్రకారం నడవాలని కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. దీనికి కేంద్రం అంగీకరించడం లేదు. ఇప్పుడు ప్రజల ముందే పెట్టాలనుకుంటున్నారు.

అయితే ఇందుకోసమే ప్రత్యేక అసెంబ్లీ పెడుతున్నారా? లేదా? ఏదైనా సంచలనానికి తెరతీయబోతున్నాడా? అన్నది తేలాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.