Begin typing your search above and press return to search.
నీటి లొల్లిపై కేంద్రం గెజిట్ పై కేసీఆర్ గరంగరం ఎందుకు?
By: Tupaki Desk | 17 July 2021 4:31 AM GMTసమఉజ్జీలు ఇద్దరు తలపడినప్పుడు పోరు ఎంత రసవత్తరంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎత్తులు.. పైఎత్తులతో ఒకరికొకరు షాకులిచ్చుకుంటున్న వేళలో.. అనూహ్యంగా సీన్లోకి పెద్ద మనిషి ఒకరు ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అలాంటి పరిస్థితే తాజాగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కనిపిస్తోంది. విడిపోయి కలిసి ఉందామన్న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ప్రాథమిక నినాదాన్ని పక్కన పెట్టేసి.. ఎవరికి వారు.. వారి రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే తప్పించి.. ఇతరుల గురించి పట్టించుకోమన్న తీరు కొత్త రచ్చకు కారణమైంది. నిజమే.. ఒక రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత.. ఆయా పాలకులకు తమ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరించటాన్ని అర్థం చేసుకోవచ్చు.
కాకుంటే.. ఇరుగుపొరుగు రాష్ట్రాలుగా ఉండే ఇతరులతో పోలిస్తే.. ఒకే భాష మాట్లాడే ప్రజలు రెండు రాష్ట్రాలుగా ఉన్న వేళలో.. ఇచ్చిపుచ్చుకునే ధోరణిచాలా ముఖ్యం. అవసరమైతే.. ఇతర రాష్ట్రాలతో కోట్లాడటానికి.. హక్కుల సాధన కోసం తెలుగు రాష్ట్రాలు రెండు కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. అయితే.. అందుకు భిన్నంగా జలవివాదాలతో రెండు తెలుగు రాష్ట్రాలు సిగ పట్టుకోవటం.. న్యాయం చెప్పాలంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరటం తెలిసిందే. దీంతో.. ఎంట్రీ ఇచ్చిన కేంద్రం తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాల్ని చెక్ పెడతామని చెబుతూనే.. ఇద్దరికి దెబ్బ పడేలా కొన్ని నిర్ణయాల్ని వెల్లడించింది.
ఇందులో ఏపీతో పోలిస్తే.. తెలంగాణకే ఎక్కువ ఇబ్బంది అని చెప్పక తప్పదు. కృష్ణా, గోదావరి జలాల వినియోగం విషయంలో తెలుగు రాష్ట్రాలు రెండూ.. తాము చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు ఆరు నెలల లోపు అనుమతులు తీసుకోవాలని బోర్డు షరతు పెట్టింది. ఇదే విషయాన్ని గురువారం రాత్రి విడుదల చేసిన గెజిట్ లోనూ స్పష్టం చేసింది. అంతేకాదు.. గెజిట్ నోటిఫికేషన్ లో అనుమతి లేని ప్రాజెక్టుల పేర్లను ప్రస్తావించినంత మాత్రాన.. వాటిని ఆమోదించినట్లు కాదన్న స్పష్టతను ఇస్తూ.. ఆయా ప్రాజెక్టులను ఆర్నెల్ల లోపు అనుమతి తీసుకోవాలని.. ఒకవేళ ఆ విషయంలో ఫెయిల్ అయితే ఆ ప్రాజెక్టులను పక్కకు పెట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఒకవేళ అనుమతి తీసుకోని ప్రాజెక్టులు పూర్తి అయిన పక్షంలో.. వాటికి సంబంధించి నీటిని వినియోగించటానికి వీల్లేదని స్పష్టం చేస్తూ.. హెచ్చరికను జారీ చేసింది. గెజిట్ లో పేర్కొన్న ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల్ని దెబ్బ తీయటం ఖాయం. మరింత స్పష్టంగా చెప్పాలంటే.. తెలంగాణ రాష్ట్రానికి కొత్త చిక్కు వచ్చి పడినట్లే. ఎందుకంటే.. ఏపీతో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్రమే అత్యధిక ప్రాజెక్టుల్ని నిర్మిస్తోంది. దీంతో.. ఆయా ప్రాజెక్టులకు అనుమతులుపొందేందుకు కేవలం ఆర్నెల్లు మాత్రమే గడువు ఉండటంతో.. వాటి భవితవ్యం ఇప్పుడు సందేహంలో పడిన పరిస్థితి.
తెలంగాణ వరకు చూస్తే.. మొత్తం 12 ప్రాజెక్టులకు అనుమతి లేదు. అయితే..విభజన చట్టంలో రెండింటిని ప్రస్తావించిన నేపథ్యంలో వాటి మినహా మిగిలిన 10 ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడున్న ప్రశ్న. ఇక.. ఏపీ విషయానికి వస్తే.. ఏడింటికి అనుమతులు లేకున్నా.. అందులో నాలుగు ప్రాజెక్టులను విభజన చట్టంలోని పదకొండో షెడ్యూల్ లో ప్రస్తావించినందున.. వాటికి అధికారికంగా గుర్తింపు లభించినట్లు అవుతుంది. దీంతో.. కేంద్రం విడుదల చేసిన గెజిట్ పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గరంగరంగా ఉన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో తెలంగాణలో సెంటిమెంట్ ను రేపటం ద్వారా.. రాజకీయ ప్రయోజనాలను ఆశించిన ఆయనకు.. మొదటికే మోసం వచ్చే రీతిలో కేంద్రం విడుదల చేసిన గెజిట్ లోని అంశాలు ఉన్నాయన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
దీంతో.. గెజిట్ ను గుర్తించేందుకు తెలంగాణ సిద్ధంగా లేదన్న మాట సీఎం కేసీఆర్ నోటి నుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. తాజా గెజిట్.. కేసీఆర్ కు మహా ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గెజిట్ లో పేర్కొన్న ప్రకారం.. కృష్ణానదిపై తెలంగాణ.. ఏపీ చేపట్టిన ప్రాజెక్టుల్ని చూస్తే..
తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు
ఎస్ఎల్బీసీ (శ్రీశైలం ఎడమగట్టు కాల్వ)
ఎస్ఎల్బీసీ సామర్థ్యం మరో పది టీఎంసీలు పెంపు
కల్వకుర్తి ఎత్తిపోతల
కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం అదనంగా 15 టీఎంసీలు పెంపు
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్
డిండి ఎత్తిపోతల
ఎలిమినేటి మాధవరెడ్డి లిఫ్టు
భక్త రామదాస ఎత్తిపోతల
తుమ్మిళ్ల ఎత్తిపోతల
నెట్టెంపాడు ఎత్తిపోతల
నెట్టెంపాడు సామర్థ్యం అదనంగా 3.4 టీఎంసీలు పెంపు
దేవాదుల లిఫ్టు ద్వారా గోదావరి జలాలు కృష్ణా బేసిన్‌కు మళ్లించే ప్రాజెక్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్టులు
తెలుగు గంగ
వెలిగొండ
హంద్రీ-నీవా
గాలేరు-నగరి
ముచ్చుమర్రి ఎత్తిపోతల
సిద్ధాపురం ఎత్తిపోతల
గురు రాఘవేంద్ర