Begin typing your search above and press return to search.
దేశాన్నే మార్చాలనే వేళలోనూ ఆంధ్రోళ్ల మీద అలాంటి మాటలా కేసీఆర్?
By: Tupaki Desk | 22 Feb 2022 5:30 AM GMTలక్ష్యం మారింది. కొత్త గురి ఎజెండాలో చేరింది. అలాంటి వేళ చేతలే కాదు మాటలు కూడా మారాలి కదా? అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ఉంటున్నాయి. నేను తోపును.. తురుంఖాన్ ను అని చెప్పటాన్ని ఎవరూ కాదనరు. కానీ.. ఆ మాటలు చెప్పేందుకు తన సోదర రాష్ట్రాన్ని.. అక్కడి ప్రజల మనసుల్ని గాయపరిచేలా మాట్లాడటం.. వారిని చిన్నబుచ్చటం ద్వారా తానెంత గొప్పోడ్ని అన్న విషయాన్ని చెప్పుకోవటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్నగా మారింది.
తెలంగాణ రాష్ట్రాన్ని విడిచి పెట్టి.. దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని.. జాతీయస్థాయిలో సరికొత్త జట్టును తయారు చేసి మోడీ అండ్ కో స్థానంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించే వేళలో.. కేసీఆర్ మాటలు ఎలా ఉండాలి? కులాలు.. మతాల పేరుతో చీలికలు చేస్తూ అవకాశవాద రాజకీయాలను చేస్తున్నారంటూ మోడీ పరివారంపై విమర్శలు సంధించే వేళలో.. కేసీఆర్ మాటలు ఎంత ఉన్నతంగా ఉండాలి. అందుకు బదులుగా ఆయన మాటలు ఆంధ్రా.. తెలంగాణను దాటని తీరు ఏ మాత్రం సరికాదనే చెప్పాలి.
ఉమ్మడి ఏపీలోని కొందరు పాలకులు చేసిన వ్యాఖ్యల్ని పదే పదే ప్రస్తావించి.. ఆంధ్రోళ్లను కుళ్లబొడుస్తున్న కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే వేళలోనూ ఇదే తీరును ప్రదర్శించటం దేనికి నిదర్శనం? బంగారు తెలంగాణ మాదిరే బంగారు భారతదేశాన్ని తయారు చేసుకోవాలన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాల గురించి గుక్క తిప్పుకోకుండా చెప్పుకొచ్చిన కేసీఆర్.. ఏపీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రాన్ని సాధించుకునే వేళలో ఎన్నో బద్నాంలు చేశారని.. పట్టుబట్టి తెలంగాణను సాధించుకున్నామన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడితే ఎన్నో అపనమ్మకాలు కలిగించారని.. కరెంటు రాదని.. చీకటైపోతదని.. పరిశ్రమలు మొత్తం తరలిపోతాయని.. పాలన చేతకాదని చెప్పారన్నారు.
‘ఇప్పుడు వాళ్ల వద్దే కరెంటు లేదు. ఇవాళ తెలంగాణలో 24 గంటల కరెంటుంది. మోటార్లు.. ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోని నాణ్యమైన కరెంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. మంచినీళ్ల బాధ శాశ్వతంగా పోయింది’ అన్న ఆయన మాటల్లో ఏపీని చిన్నబుచ్చేలా మాటలు ఉండటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్నగా మారింది.
జాతీయ రాజకీయాలు చేయాలనుకునే అధినేతకు దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. సీఎం కేసీఆర్ ఆ పని చేయగలరా? అలా చేసే ఉద్దేశమే ఉంటే.. ఇప్పటికి ఏపీని ఉద్దేశించి ఆ మాటలేంది? అన్నది ప్రశ్నగా చెప్పక తప్పదు.