Begin typing your search above and press return to search.
గుజరాత్, ఏపీపై కేసీఆర్ గురి.. 100 స్థానాలు టార్గెట్?
By: Tupaki Desk | 9 Nov 2022 3:30 AM GMTమునుగోడు ఉప ఎన్నికల్లో వచ్చిన గెలుపు జోష్ లో పార్టీని మరింత విస్తరించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే బీఆర్ఎస్ ను మొదలుపెట్టిన కేసీఆర్ ఈ మేరకు ప్రక్రియను షురూ చేశారు. హోరాహోరీగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో కాషాయపార్టీని ఓడించిన ఉత్సాహంతో జాతీయస్థాయికి బీఆర్ఎస్ ను బలంగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సమాచారం.
తెలంగాణలోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా బీజేపీని ఎదుర్కొనేందుకు కేసీఆర్పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్న గుజరాత్అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులను బరిలోకి దింపే ఆలోచన గులాబీ బాస్ చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కొంతమంది నేతలతో కూడిన టీఆర్ఎస్ బృందం గుజరాత్ కు వెళ్లినట్టు సమాచారం. అక్కడి తెలుగు సంఘాలు, సూరత్ వంటి చోట్ల ఉన్న తెలుగు ప్రజలు, నేతలతో కనెక్ట్ అయినట్టు సమాచారం.
బీఆర్‌ఎస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసేందుకు గుజరాత్ లోని సెటిలర్ ఎవరైనా ఆసక్తి చూపుతున్నారో లేదో తేల్చాలని కేసీఆర్ నిఘా వర్గాలను కోరారు. మంచి ఫాలోయింగ్ ఉన్న సెటిలర్లు, ప్రభావశీలులు, ఎన్నికల కోసం ఆర్థికంగా ఖర్చు పెట్టగలవారే టార్గెట్ గా కేసీఆర్ నిఘా వర్గాలకు సమాచారం అందించారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 100 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను పోటీలోకి దింపేందుకు ఇప్పటి నుంచే కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇందుకు గాను తెలంగాణతోపాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలను కేసీఆర్ ఎంపిక చేసినట్టు సమాచారం.
దేశవ్యాప్తంగా మొత్తం 543 స్థానాల్లో పోటీ చేయడమంటే కష్టతరమైన పని. ఆర్థిక వనరులకు చాలా డబ్బులు ఖర్చులు చేయాల్సి ఉంటుంది. అందుకే పెద్ద నియోజకవర్గాలు బలమైన నేతలు ఉన్న స్థానాల్లో కాకుండా ఖర్చు తక్కువయ్యే చిన్న పార్లమెంట్ స్థానాలను బీఆర్ఎస్ ఎంచుకోనుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
డిసెంబర్ 7న బీఆర్ఎస్ పేరు అధికారికంగా ఖరారు అయిన తర్వాత ఏయే రాష్ట్రాల్లో బరిలోకి దిగుతారనే విషయంపై క్లారిటీ ఇస్తారని టీఆర్ఎస్ సీనియర్లు అంటున్నారు. స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకునే విషయంతోపాటు మిగతా అన్ని విషయాలపై కూడా కేసీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
మరోవైపు, పేరు మార్పు ప్రతిపాదన కోసం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)ని టీఆర్ఎస్ పరిశీలిస్తోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం ఈసీ అధికారులను కలిసి పార్టీ మార్పుపై సమాచారం అందించింది. కానీ హిమాచల్ ప్రదేశ్ మరియు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో ఈసీ చాలా బిజీగా ఉంది. పేరు మార్పుకు మరికొంత సమయం పట్టవచ్చని టీఆర్ఎస్ అనుమానిస్తోంది.
ఒకవేళ ఈసీ టీఆర్‌ఎస్ పేరు మార్పును ఆలస్యం చేస్తే, కేసీఆర్ ప్లాన్ బిపై నిర్ణయం తీసుకోలేదు. సమయం పెరుగుతున్న కొద్దీకేసీఆర్ గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అడుగులు వేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని అంచనా వేయడానికి ఇప్పటికి చాలా త్వరగా పనులు పూర్తి చేయిస్తున్నారు
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.