Begin typing your search above and press return to search.
కేసీఆర్, జగన్.. చంద్రబాబు ట్రాన్స్‌లో ఉన్నారా?
By: Tupaki Desk | 21 April 2021 8:55 AM GMTతెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ - ఏపీ సీఎం జగన్ - ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు ట్రాన్స్‌లో ఉన్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. మరి దీనికి కారణం ఏంటి? ఇదిగో ఇలా.. చంద్రబాబు విషయాన్ని పరిశీలిస్తే.. ఆయన వ్యవస్థలను మేనేజ్ చేస్తారని.. ఈ విషయంలో ఆయన దేశం లోనే ముందున్నారని అంటారు రాజకీయ విశ్లేషకులు. లేనిది సృష్టించడం.. అంతా మనకు అనుకూలం గా ఉందని.. ప్రచారం చేయడం.. వంటి విషయాల్లో చంద్రబాబును మించిన నాయకుడు ఈ దేశంలో ఎవరూ లేరని చెబుతారు. ఈ మాట ఎందుకు చెబుతున్నారంటే.. దీనికి కూడా రీజన్ ఉంది.
2014 ఎన్నికల్లో.. టీడీపీ.. బీజేపీ, జనసేనలతో కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లి విజయం దక్కించు కుంది. అయితే.. తర్వాత .. తెలంగాణలో వెలుగు చూసిన.. ఎమ్మెల్యే ఎన్నికల్లో స్టీఫెన్‌సన్‌కు ఓటు కోసం డబ్బులు ముట్టచెప్పేందుకు ప్రయత్నించి.. ఓటుకు నోటు కేసులో బాబు ఇరుక్కున్నారు. ఈ క్రమంలోనే హుటాహుటిన హైదరాబాద్ నుంచి ఏపీకి తరలివచ్చారు. ఈ క్రమంలో మన సమస్యలు మనమే పరిష్క రించుకుందాం.. అని చెప్పి.. అమరావతిని సృష్టించారు. ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత మళ్లీ రాజకీయ ఎత్తులతో ఉప ఎన్నికల్లో వైసీపీని - టీఆర్ ఎస్‌ను ఇబ్బంది పెట్టే పనులు చేశారని.. అంటారు.
ఈ క్రమంలో మీడియా మేనేజ్ మెంట్‌తో ఆయా పార్టీలపై విరుచుకుపడ్డారు. ఉదాహరణకు.. 2017లో వచ్చిన నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో అంతా మనమే గెలుస్తున్నాం.. అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటికీ.. కేవలం 25 వేల ఓట్ల తేడాతోనే ఇక్కడ విజయం దక్కించుకున్నారు. ఇక, కడప లోకల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించడానికి మీడియాను వాడుకున్నారు. ఇలా మీడియాను వాడుకుంటూ.. మేనేజ్ చేసుకుంటూ.. పోయారు.
ఇక, మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలోనూ ఇదేవిధంగా చంద్రబాబు వ్యవహరించారు. హోదా వద్దు అని ..ఒకసారి.. ప్యాకేజీ ముద్దని ఒకసారి.. చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు పాటించారు. అదేసమ యంలో వైసీపీ ఎంపీలు.. రాజీనామా చేసిన తర్వాత.. మళ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల సింపతీ కోసం.. మళ్లీ హోదా రాగం అందుకున్నారు. ఢిల్లీ స్థాయిలో ప్రధాని మోడీని టార్గెట్ చేసి.. దుమ్మెత్తి పోశారు. ఇక, తెలంగాణ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా.. ఒకవైపు టీడీపీ సీనియర్లు తిట్టిపోస్తున్నా.. పట్టించుకోకుండా.. కాంగ్రెస్‌తో జట్టుకట్టి ఎన్నికల్లో కి దిగారు.
బీజేపీతో కటీఫ్ చేసుకుని, కేంద్రంలో మంత్రులుగా ఉన్న టీడీపీ ఎంపీలను బయటకు తెచ్చారు. ఇదేసమయంలో మోడీ పని అయిపోయింది.. రాజకీయాల నుంచి మోడీని తరిమేస్తానంటూ.. బీజేపీకి బద్ధ శత్రువులైన.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతతో చేతులు కలిపారు చంద్రబాబు. మరోవైపు.. తాను ప్రధాని అవుతానని, లోకేష్ ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి అని తనంతట తనే ప్రకటించుకుని.. అనుకూల వర్గాల్లో ప్రచారం చేయించుకున్నారు.
ఈ క్రమంలో చంద్రబాబు తనపై పెరిగిన వ్యతిరేకతను గుర్తించలేక పోయారు. మరోవైపు జగన్‌కు ఒక ఛాన్స్ ఇవ్వాలని ప్రజలు భావిస్తుండడాన్ని కూడా బాబు గ్రహించలేక పోయారు. ఈ క్రమంలో ఉద్యోగులు, మహిళలు, రైతులు.. బాబుపై వ్యతిరేకతతో.. జగన్‌ను 151 మంది ఎమ్మెల్యేలతో ఘన విజయం అందించారు. ఇక, ఇప్పుడు మరో విషయం ఏంటంటే.. నిజానికి తెలంగాణలోనూ కేసీఆర్ ప్రభుత్వంపై అక్కడి ఇవే వర్గాలు వ్యతిరేకతతో ఉన్నాయి. నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు.. తీవ్ర వ్యతిరేకతలో ఉన్నారు. సర్వేల్లో ఈ విషయం స్పష్టంగా తెలిసింది.
అయితే.. ఉప ఎన్నికలో కానీ, స్థానిక ఎన్నికల్లో కానీ.. వన్‌సైడ్ ఓట్లు వేయించుకుని.. వారికి వారే మోసం చేసుకుంటున్నారని.. అని అంటున్నారు. అదేవిధంగా జగన్ ప్రభుత్వం కూడా పంచాయతీ, పరిషత్, మునిసిపాలిటీ ఎన్నికల్లో అలానే చేసిందని , నిజమైన ఎన్నికలు కాదని.. అంటున్నారు. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటే.. ఆ పార్టీనే స్థానిక, ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తారని చెబుతున్నారు. కానీ, చంద్రబాబు ఏవిధంగా ఇబ్బంది పడ్డారో.. టీఆర్ఎస్, జగన్.. వచ్చే ఎన్నికల నాటికి అభివృద్ధి, నిరుద్యోగం, ఉద్యోగుల సంక్షేమం.. వంటి విషయాలు పట్టించుకోకపోతే.. ఇబ్బంది తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.