Begin typing your search above and press return to search.

పోల్ ఫార్ములా కేసీఆర్ కు బాగానే వంటబట్టేసిందా?

By:  Tupaki Desk   |   25 Oct 2019 4:49 AM GMT
పోల్ ఫార్ములా కేసీఆర్ కు బాగానే వంటబట్టేసిందా?
X
ఇంట్లో ఉండే నలుగురి మనసుల్లో ఏముందో తెలుసుకోవటమే పెద్ద సమస్య. కొందరికైతే జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవటానికే కిందామీదా పడుతుంటారు. అలాంటిది కోట్లాది మంది మైండ్ సెట్ ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకోవటంతోపాటు.. ఓటు వేసే వేళలో తనకు తప్పించి మరెవరికీ ఓటు వేయకుండా ఉండేలా చేయటం అంత చిన్న విషయం కాదు. ఓపక్క మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ కేసీఆర్ మీద తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ..హుజూర్ నగర్ ఉప ఎన్నికల లాంటి అగ్నిపరీక్ష ఎదుర్కోవటం అంత తేలికైన విషయం కాదు.

తాను కానీ గురి పెట్టి.. పట్టుదలతో సాధించాలనుకుంటే అసాధ్యమైనది ఏమీ కాదన్న విషయాన్నితాజా విజయంతో ఫ్రూవ్ చేశారు కేసీఆర్. మరి.. సార్వత్రిక ఎన్నికల్లో ఈ కత ఏమైందని కొందరు అడగొచ్చు. కానీ.. మర్చిపోకూడని విషయం ఏమంటే.. హుజూర్ నగర్ మీద కేసీఆర్ చేసిన వర్క్ లో యాభై శాతం పని.. సార్వత్రిక ఎన్నికల్లో చేసినా ఫలితం మరోలా ఉండేదని చెప్పక తప్పదు.

తాజాగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్ని గుర్తించిన కేసీఆర్ మరింత అలెర్ట్ అయ్యారని చెప్పాలి. అది ఒకందుకు మేలు జరిగిందనే చెప్పాలి. ఓటమికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అప్రమత్తత మరింత జాగ్రత్తగా వ్యవహరించేలా చేసింది. ఏ చిన్న తప్పు జరగకుండా ఉండేలా ఎప్పటికప్పుడు మానిటర్ చేయటమే కాదు.. ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తెలుసుకోవటం లాంటి వాటితో విజయాన్ని తమ సొంతమయ్యేలా చేశారని చెప్పాలి.

తాజా విజయాన్ని చూసినప్పుడు కేసీఆర్ కు మాత్రమే సాధ్యమైన పోల్ ఫార్ములాను మోడీషాలు ఫాలో కావాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు. మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా పక్కా పోల్ ఫార్ములాను సెట్ చేయటంలో కేసీఆర్ ప్లానింగ్ మీద మోడీషాలు పాఠాలు నేర్చుకుంటే మంచిదన్న అభిప్రాయం హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం చూశాక అనిపించక మానదు.