Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఆ పని ఎందుకు చేయలేకపోయారు?
By: Tupaki Desk | 23 Oct 2015 8:45 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించిన పనిని ఎందుకు చేయలేకపోయారు? దాదాపు ఏడాదిగా పదే పదే చెప్తూ వస్తున్న ముఖ్యమైన నిర్ణయం విషయంలో ముఖ్యమంత్రి ఎందుకు వెనకడుగు వేశారు అనే ఆసక్తికర చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.
హైదరాబాద్ లో నివసిస్తున్న పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించేందుకు గత ఏడాది కేసీఆర్ శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్ సమీపంలో ఐడీహెచ్ కాలనీ ఎంపిక చేసి అక్కడో మోడల్ కాలనీకి శ్రీకారం చుట్టారు. అక్కడికి పార్టీ ఎమ్మెల్యేలను పంపించి ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించాలని కూడా సూచించారు. పనుల పురోగతిపై కేసీఆర్ వరుస సమీక్షలు కూడా చేశారు. ఈ దసరాకు ఆ ఇళ్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు, తద్వారా దసరా పండుగ సంతోషంగా జరుపుకుందామని అక్కడి పేదలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
అయితే దసరా సందర్భంగా ఆ ఇళ్లల్లోకి గృహప్రవేశం జరగలేదు. ఎంతగానో ఎదురుచూసిన ఆ ప్రక్రియ ఆగిపోవడంతో స్థానికంగా ఇళ్లు మంజూరు అయిన ఆ పేదలు నిరాసక్తతో ఉన్నారు. అయితే ప్రారంభోత్సవం వాయిదా పడటంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కుదరలేదని పలువురు అంటుండగా... పనులు పూర్తికాకపోవడమే అసలు కారణమని పలువురు వివరిస్తున్నారు.