Begin typing your search above and press return to search.
ఓవైసీకి కేసీఆర్ గిఫ్ట్..
By: Tupaki Desk | 18 March 2018 10:04 AM GMTతెలంగాణ రాజకీయాల్లో ఇటీవల కలిసిన బంధం అయిన టీఆర్ ఎస్- ఎంఐఎంల ఫలితంగా కొత్త ప్రయోజనాలు తెరమీదకు వస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తన మిత్రపక్షం అయిన ఎంఐఎం అధినేత - హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి భారీ నజరాన ఇచ్చేందుకు సిద్ధమయ్యారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఏకంగా హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున వందలాది కోట్ల రూపాయల ఆస్తిని కట్టబెట్టేందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆర్డర్ వేయడం కలకలం రేకెత్తిస్తోంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని ఒవైసీ హాస్పిటల్ కు కేటాయించటానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని సమాచారం. మాసబ్ ట్యాంక్ లోని మహావీర్ హాస్పిటల్ కు గతంలో కేటాయించిన ఈ స్థలాన్ని నామమాత్రపు ధరకు దారూసలం ఎడ్యుకేషనల్ సొసైటీకి లీజు పేరుతో బదలాయించటానికి సూత్రప్రాయంగా అంగీకరించిన ప్రభుత్వం వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనిని ఎజెండా అంశంగా పెట్టటానికి ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక నోట్ రెవిన్యూ శాఖకు అందింది. దీనిపై రెవిన్యూ శాఖలో ఫైల్ కదులుతున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే మాసాబ్ ట్యాంక్ లో 14,798 చదరపు గజాల విలువైన ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలాన్ని 1975లో జీవో ఎంఎస్ నంబర్ 1095 తేదీ 13.8.1975 ద్వారా మహావీర్ హాస్పిటల్ కోసం 30 సంవత్సరాలు లీజుకు ఇవ్వటానికి రెవిన్యూ శాఖ అనుమతించింది. ఎకరానికి సంవత్సరానికి కేవలం 12 రూపాయలకే ఈ లీజ్ ఇవ్వటం విశేషం. ఈ లీజ్ 1977 నుంచి అమల్లోకి వచ్చింది. 2007లో లీజ్ గడువు ముగిసింది. గడువు ముగిసిన వెంటనే ప్రభుత్వం దీనిని పొడిగించ లేదు. అత్యంత విలువైన ఈ స్థలాన్ని ప్రభుత్వ వైద్యశాలకు కానీ, కార్యాలయాలకు కానీ వినియోగించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. దారూసలం ట్రస్ట్ ఆధ్వర్యంలోని డెక్కన్ మెడికల్ కాలేజీ - ఒవైసీ హాస్పటల్ కు అనుబంధంగా ఈ స్థలంలో మరో వైద్యశాల ప్రారంభించటానికి తమకు లీజ్‌కు ఇవ్వాల్సిందిగా ఈ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న అక్భరుద్ధీన్ ఒవైసీ అప్పటి ప్రభుత్వాన్ని కోరారు. అయితే అప్పటి ప్రభుత్వం దానికి నో చెప్పింది.
ఇదిలాఉండగా...రాష్ట్ర విభజన సందర్భంగా గవర్నర్ పాలన విధించిన తర్వాత రాష్ట్ర గవర్నర్ ఆదేశాలతో మహావీర్ హాస్పిటల్ లీజ్ గడువును 2014లో పొడిగించారు. ఈ మేరకు హైదరాబాద్ కలెక్టర్‌కు అధికారాలిస్తూ 2014 మే 23 న జీఓ ఎంఎస్ నంబర్ 230ని రెవిన్యూ శాఖ జారీ చేసింది. మరో 30 సంవత్సరాలు లీజ్ పొడిగిస్తున్నట్టు ఆ జీఓలో పేర్కొన్నారు. మొదటి లీజ్ గడువు ముగిసిన 2007 సంవత్సరం నుంచీ కొత్త లీజ్ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఎకరానికి ఎంత అద్దె చెల్లించాలో నిర్ణయించాల్సిందిగా హైదరాబాద్ కలెక్టర్ ను ప్రభుత్వం ఆదేశించింది. అయితే భూమి యాజమాన్య హక్కులు ప్రభుత్వం వద్దే ఉంటాయని - ప్రభుత్వానికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు లీజ్ రద్దు చేస్తామని జీఓలో కొన్ని షరతులు విధించారు. తమ వైద్యశాల కోసం మహావీర్ స్ఠలం కావాలని కోరిన ఫైల్ పెండింగ్‌లో ఉన్నదని అక్బరుద్థీన్ ఒవైసీ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి ఇటీవల తీసుకువెళ్లినట్టు తెలిసింది. దీనితో ఈ స్థలం లీజ్ ప్రతిపాదన మళ్ళీ తెరపైకి వచ్చింది.
అయితేమహావీర్ వైద్యశాలకు కేటాయించిన మాసబ్‌ట్యాంక్‌లోని స్థలానికి సంబంధించిన లీజ్ రద్దు చేస్తే ఆ స్థలాన్ని నీలోఫర్‌కు కానీ ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌కు కానీ కేటాయించాలని వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రభుత్వాన్ని కోరింది. 500 పడకల సామర్ధ్యం కలిగిన నీలోఫర్ వైద్యశాలను 1,000 నుంచి 1200 పడకలకు - 250 పడకల సామర్ధ్యం కలిగిన ఎంఎన్ జే హాస్పిటల్ ను 800 నుంచి 1000 పడకలకు పెంచాలనే ప్రతిపాదన ఉంది. ఈ రెండు వైద్యశాలల్లో ఒకదానికి మాసబ్ ట్యాంక్‌లోని స్థలం కేటాయించాలనే ప్రతిపాదనను ప్రస్తుతానికి ప్రభుత్వం పక్కన పెట్టింది. మరోవైపు ఓవైసీలకు ఇచ్చేందుకు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ వేగంగా ముందుకు సాగుతుండటం పట్ల అధికార వర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. తమ రాజకీయ వ్యూహాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.