Begin typing your search above and press return to search.
విశాఖలో ల్యాండ్ అవుతున్న కేసీయార్...మ్యాటర్ సీరియస్సే...
By: Tupaki Desk | 20 Oct 2022 11:24 AM GMTకేసీయార్ తెలంగాణా సీఎం. ఆయన విశాఖ రావడమేంటి అని డౌట్ రావచ్చు. అయితే ఆయన దసరా ముందు వరకూ టీయారెస్ పార్టీ అధినేత. కానీ ఈ రోజున ఆయన బీయారెస్ తరఫున అధినేత. అంటే జాతీయ నాయకుడు. ఆయన దేశం మొత్తం మీద ఎక్కడైనా తిరగవచ్చు. అందులో భాగంగా ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో భాగమైన ఏపీలో కూడా కేసీయార్ తన బీయారెస్ కోసం దూకుడుగా పొలిటికల్ యాక్టివిటీని మొదలెట్టనున్నారు. దాని కోసం తొలుత విజయవాడ అనుకున్నా ఇపుడు విశాఖ వైపు కేసీయార్ చూస్తున్నట్లుగా చెబుతున్నారు.
విశాఖ మీద కేసీయార్ కి ఉన్న స్పేషల్ ఇంటరెస్ట్ ఏంటి అంటే విశాఖ పక్కన ఉన్న బొబ్బిలి కేసీయార్ పూర్వీకుల సొంత ప్రాంతం. కేసీయార్ ముత్తాతల కాలంలోనే వారంతా తెలంగాణా ప్రాంతానికి వలస వెళ్లారు. ఆ విధంగా వారు స్థిరపడడంతో కేసీయార్ పక్కా తెలంగాణావాసి అయ్యారు. ఆయనే తేలంగాణావాదిగా మారి కలగా అంతా అనుకున్న తెలంగాణాను సాధించి చూపారు.
అయితే ఉద్యమ కాలంలో కేసీయార్ మీద అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఆయన ఏపీకి చెందిన వారు అయి ఉండి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు అని కూడా ఇక్కడ ఆయన పూర్వీకుల చరిత్రను తీసి చాలా మంది కామెంట్స్ చేశారు. కేసీయార్ ది పక్కా ఆంధ్రా మూలాలు అని ఆయన తెలంగాణా ఉద్యమం చేయడమేంటి అని అక్కడ ఆయన ప్రత్యర్ధులు విమర్శలు గుప్పించారు. అయితే ఇవేమీ కేసీయార్ వజ్ర సంకల్పం ముందు ఎక్కడా పనిచేయలేదు. దాంతో కేసీయార్ తెలంగాణా సాధించి రెండు సార్లు సీఎం అయ్యారు.
ఇపుడు ఆయన జాతీయ పార్టీని ఏర్పాటు చేశారు. దాంతో ఆనాటి విమర్శలే ఇపుడు ఆయనకు వరాలుగా మారుతున్నాయని అంటున్నారు. కేసీయార్ వి ఆంధ్రా మూలాలు అని నాడు అన్న మాటలనే ఆయన సెంటిమెంట్ గా వాడుకోబోతున్నారు. అందుకే ఆయన విశాఖ అదిరిపోయే రేంజిలో బీయారెస్ ఆవిర్భావ సభను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సభ వెనక రాజకీయ సామాజిక కోణం కూడా ఉంది అని అంటున్నారు.
సామాజిక కోణం పరంగా చూస్తే ఉత్తరాంధ్రా జిల్లాలలో అతి పెద్ద సంఖ్యలో కేసీయార్ సామాజికవర్గం వారు ఉన్నారు. ఇక కేసీయార్ బంధువులు తెల్సిన వారు కూడా ఈ ప్రాంతంలో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అలాగే రాజకీయంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. వారిని ఇపుడు ఆయన పేరు పేరునా పిలిచి బీయారెస్ లో పెద్ద పీట వేయబోతున్నారు అని అంటున్నారు. దాంతో కేసీయార్ విశాఖ సభ సూపర్ హిట్ చేయడానికి ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు అని అంటున్నారు.
ఇక కేసీయార్ సభ వచ్చే ఏడాది అంటే 2023 జనవరిలో సంక్రాంతి పండుగ దాటిన తరువాత నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే టీయారెస్ కి చెందిన కొందరు పెద్దలు ఉత్తరాంధ్రాలోని కీలక రాజకీయ నాయకులతో ఫోన్లో మాట్లాడారని అంటున్నారు. వారిని బీయారెస్ వైపుగా నడిపించి తద్వారా ఉత్తరాంధ్రాలో గట్టి పట్టు సాధించాలని కేసీయార్ చూస్తున్నారు అని అంటున్నారు.
ఇక ఆనాడు తెలుగుదేశంలో కీలకంగా ఉన్న నాయకుడు, నేడు టీయారెస్ లో కీలక మంత్రి అయిన తలసాని శ్రీనివాస యాదవ్ తొందరలో విశాఖ వస్తారని అంటున్నారు. ఆయన టూర్ లో కొంతమంది కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతారు అని అంటున్నారు. ఇప్పటికైతే ఉత్తరాంధ్రాలో మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, కొణతాల రామక్రిష్ణ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే వెలమ సామాజికవర్గం నుంచి కీలక నేతల మీదనే కన్ను వేశారని అంటున్నారు.
వీరిని పార్టీలో చేర్చుకుని ఏపీలో బీయారెస్ కి బలమైన పునాదులు వేయాలని చూస్తున్నారుట. మొత్తానికి విశాఖ మీద ఇప్పటికే అధికార వైసీపీ ఫోకస్ పెట్టింది. తెలుగుదేశానికి ఈ ప్రాంతం కంచుకోట. జనసేన కూడా ఇక్కడ నుంచే రాజకీయ లాభాలను కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇపుడు కేసీయార్ కూడా విశాఖ వైపు చూడడం మాత్రం రాజకీయంగా సంచలనం రేపుతుంది అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.