Begin typing your search above and press return to search.
కరోనాపై కేసీఆర్ తాజా కామెంట్ తెలిస్తే షాక్ తింటారు
By: Tupaki Desk | 10 July 2021 3:30 AM GMTమాయదారి కరోనాను తేలిగ్గా తీసిపారేయటమే కాదు.. తన ఉదాహరణ చెప్పి అందరిని విస్మయానికి గురి చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే పబ్లిక్ మాటలకు.. ప్రైవేటు రివ్యూలలో చేసే వ్యాఖ్యలకు ఏ మాత్రం పోలిక ఉండదా? రెండు రకాల గోళీలు వేసుకున్నంతనే కరోనా పారిపోయిందన్నట్లు సింఫుల్ గా తీసి పారేస్తూ.. అంత మాత్రం దానికి ఇంత రచ్చనా? అంటూ ఆయన మాటల సారాన్ని చాలామంది తీవ్రంగా ఖండించారు. కొందరు వైద్యులు అయితే.. కేసీఆర్ మాటలకు తీవ్రంగా నొచ్చుకున్నారు కూడా. అలాంటి కేసీఆర్.. తాజాగా జరిగిన రివ్యూ మీటింగ్ లో మాత్రం తన తీరుకు భిన్నమైన వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది.
తాజాగా ప్రగతిభవన్ లో ఆరోగ్య శాఖకు సంబంధించిన అంశాల మీద రివ్యూ జరిగింది. కరోనా తాజా పరిస్థితులు.. అందరి నోట వినిపిస్తున్న మూడో వేవ్ వేళ.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ చర్యలతో దాని తీవ్రతను తగ్గించాలి? ప్రభుత్వం రానున్న సవాల్ ను ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన ఒక మాట ఆసక్తికరంగా మారింది. పబ్లిక్ ముందు తనదైన శైలిలో మాట్లాడే కేసీఆర్.. అధికారులతో రివ్యూ నిర్వహిస్తున్న వేళ మాత్రం వాస్తవాల్ని పరిగణలోకి తీసుకునే తీరులో తేడా ఇట్టే కనిపించక మానదు.
దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తికి సరైన కారణాల్ని ఎవరూ గుర్తించలేకపోతున్నారని.. అంతుచిక్కని సమస్యగా మారిందని ఆయన వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ‘‘ఏ వేరియంట్ ఎప్పుడు వస్తుంది? ఏ వేవ్ ఎందుకు వస్తుంది? ఎంతవరకు విస్తరిస్తుందన్నది తెలియట్లేదు. ఏ రోగానికైనా దానికి కారణం దొరికితే నివారణకు మార్గం లభిస్తుంది. కానీ కరోనా స్వరూపం.. పర్యవసానాలు అర్థం కాని పరిస్థితి ఉంది. కరోనా నియంత్రణ చాలా క్లిష్టంగా మారింది. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం కావాలి. కరోనా నియంత్రణకు కొత్త మార్గాల్ని అనుసరించాలి’’ అని పేర్కొన్నట్లుగా చెబుతున్నారు.
కొత్త వేరియంట్లు..కొత్త వేవ్ లపై ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. ప్రజల్ని కరోనా బారి నుంచి రక్షించుకునే చర్యలు చేపట్టాలన్న కేసీఆర్.. మందులు.. ఇంజక్షన్ల లభ్యత ఎలా ఉంది? బెడ్లు.. ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయా? అన్న విషయాల్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలన్న సూచన చేయటం గమనార్హం. కరోనా కేసులు తీవ్రంగా ఉన్న ఢిల్లీ.. మహారాష్ట్ర.. పశ్చిమ బెంగాల్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు.. అక్కడి స్థితిగతులు.. అక్కడి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యల గురించి తెలుసుకోవాలన్న సూచన చేశారు. కరోనా నియంత్రణకు సరికొత్త మార్గాల్ని ఎప్పటికప్పుడు అనుసరించాలన్న ఆయన తీరు చూస్తే.. సెకండ్ వేవ్ సందర్భంగా ప్రభుత్వంపై వచ్చిన విమర్శలు.. మూడో వేవ్ వేళ మాత్రం రాకూడదన్నట్లుగా ప్రభుత్వం తీరు ఉందని చెప్పాలి.
కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న వేళ.. ప్రజలు అనుసరించాల్సిన విధి విధానాలపైనా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సూచనలు చేశారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టాలని చెప్పిన సీఎం కేసీఆర్.. కరోనా కట్టడి కోసం ప్రభుత్వంతో కలిసి రావాలన్న పిలుపు ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. సెకండ్ వేవ్ వేళ.. సక్సెస్ ఫుల్ గా నిర్వహించిన జ్వర సర్వేను మరికొన్ని ధఫాలు నిర్వహించటం ద్వారా.. రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో తీవ్రత ఎక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేయాలని కేసీఆర్ చెప్పినట్లుగా చెబుతున్నారు. ఓపక్క కరోనా ఏముంది.. చాలా సింఫుల్ రోగమన్నట్లుగా పబ్లిక్ లో మాట్లాడే కేసీఆర్.. కీలకమైన అధికారులతో జరిగిన రివ్యూలో మాత్రం అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేయటం గమనార్హం.