Begin typing your search above and press return to search.

క‌ల‌ల సౌధానికి శంకుస్థాప‌న చేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   27 Jun 2019 7:13 AM GMT
క‌ల‌ల సౌధానికి శంకుస్థాప‌న చేసిన కేసీఆర్
X
ముఖ్య‌మంత్రి ఎవ‌రైనా కానీ స‌చివాల‌యానికి ఎందుకు వెళ‌తారంటే?. ఇదేం ప్ర‌శ్న అని అడ‌గొచ్చు. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి విష‌యంలో మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి. గ‌డిచిన ఐదేళ్ల‌లో ప‌ట్టుమ‌ని ప‌దిసార్లు కూడా స‌చివాల‌యానికి రాని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ రోజు స‌చివాల‌యానికి వ‌చ్చారు.

ఆయ‌న స‌చివాల‌యానికి వ‌చ్చింది పాల‌నా ప‌ర‌మైన స‌మీక్ష‌లు జ‌ర‌ప‌టానికి కాదు. ఐదేళ్లుగా తానెన్నో ఆశ‌లు పెట్టుకున్న క‌ల‌ల సౌథానికి శంకుస్థాప‌న చేసేందుకు ఆయ‌న సచివాల‌యానికి విచ్చేశారు. వాస్తు స‌రిగా లేద‌న్న కార‌ణంగా స‌చివాల‌యానికి రావ‌టం లేద‌న్న మాట ప్ర‌చారంలో ఉంది. దీనికి బ‌లం చేకూరుస్తూ ఆయ‌న స‌చివాల‌యానికి రాకుండా త‌న నివాసమైన ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచే స‌మీక్షాలు.. స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు.

ముఖ్య‌మంత్రి అంటే స‌చివాల‌యానికే రావాలా? ముఖ్య‌మంత్రి ఎక్క‌డ ఉంటే అదే స‌చివాల‌యం అంటూ ఆ మ‌ధ్య చేసిన వ్యాఖ్య‌లు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తేలా చేశాయి. ఇదిలా ఉంటే.. ఈ ఉద‌యం (గురువారం) ప‌లువురు మంత్రులు వెంట రాగా కేసీఆర్ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు మంత్రుల‌తో పాటు.. ప్ర‌భుత్వ సీఎస్ కె.జోషి.. రాజ్య‌స‌భ స‌భ్యులు.. ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలు.. ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.

ప్ర‌స్తుత స‌చివాల‌యం పాతిక ఎక‌రాల విస్తీర్ణంలో ఉండ‌గా దాన్ని30 ఎక‌రాల్లో నిర్మించ‌నున్నారు. ఇప్పుడున్న స‌చివాల‌య భ‌వ‌నాల్ని నేల‌మ‌ట్టం చేసి.. ప‌క్క‌నే ఉన్న మ‌రికొన్ని భ‌వ‌నాల్నికూడా క‌లుపుకొని చ‌తురస్రాకారంగా మార్చి.. భ‌వ‌నాల్ని నిర్మించ‌నున్నారు. ఇందుకోసం రూ.400 కోట్లు ఖ‌ర్చుపెడుతున్న సంగ‌తి తెలిసిందే.