Begin typing your search above and press return to search.
కేసీఆర్ ముందుచూపు అదిరింది
By: Tupaki Desk | 17 Dec 2015 12:42 PM GMTఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలు.. అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని అడుగుతుంటారు. కానీ.. తెలంగాణ ఆర్థికవ్యవస్థకు గుండెకాయ లాంటి హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేయటానికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి మౌలిక వసతుల కల్పనకు ఆర్థికసాయం అందజేయాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి రాసిన లేఖలో పేర్కొన్నారు. రెండు తెలుగురాష్ట్రాల్లో భారీగా ఆదాయాన్ని ఆర్జించే హైదరాబాద్ నగరానికి.. నిధులు కావాలని కోరటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
రూ.5,500కోట్ల వార్షిక బడ్జెట్ కలిగిన జీహెచ్ ఎంసీ కి ఏడాదికి రూ.100కోట్లు ఇస్తే ఏ పనులూ చేపట్టలేమని స్పష్టం చేసిన కేసీఆర్.. మంచినీటి సరఫరా.. డ్రైనేజి.. .. రవాణా సదుపాయాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇక.. స్మార్ట్ నగరాల ఎంపికలో హైదరాబాద్ ను ఎంపిక చేసిన విషయాన్ని ప్రస్తావిస్తే.. హైదరాబాద్ నగరాన్ని వదిలేసి.. కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా ఎంపిక చేయాలని కోరటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. హైదరాబాద్ కు ప్రత్యేక నిధుల సాయం.. కరీంనగర్ ను స్మార్ట్ సిటీ జాబితాలోకి ఎక్కించాలన్న కేసీఆర్ ఆలోచన చూస్తే.. ఆయన ఎంతో ముందుచూపుతో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
స్మార్ట్ సిటీలో హైదరాబాద్ ను జేర్చటం వల్ల వచ్చే మార్పు స్వల్పం. అదే కరీంనగర్ ను స్మార్ట్ సిటీ జాబితాలో చేరిస్తే.. దానివల్ల కలిగే ప్రయోజనం భారీగా ఉంటుంది. అదే సమయంలో.. హైదరాబాద్ అభివృద్ధికి భారీగా నిధుల కోసం డిమాండ్ చేస్తే.. కేంద్రం నుంచి ఎంతోకొంత నిధులు రావటం ఖాయం. ఒకవేళ.. అలాంటిదేమీ లేకపోతే.. విమర్శల అస్త్రం బయటకు తీయొచ్చు. ఎటు చూసినా కేసీఆర్ కే లాభమన్నట్లుందే..?