Begin typing your search above and press return to search.

11 గంటల పాటు లైవ్ లో ఉన్న కేసీఆర్

By:  Tupaki Desk   |   2 Sep 2021 3:30 PM GMT
11 గంటల పాటు లైవ్ లో ఉన్న కేసీఆర్
X
నిన్న (బుధవారం) కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. దీనికి ఏపీ.. తెలంగాణకు చెందిన ముఖ్య అధికారులు హాజరయ్యారు. ఇందుకు హైదరాబాద్ లోని జలసౌధ వేదికైంది. ఈ సమావేశానికి బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరిగింది. మొత్తం రెండు అంశాలకు సంబంధించి మొత్తం పదకొండు గంటల సుదీర్ఘ సమావేశం సాగింది. మొదటి సమావేశం కృష్ణాజలాల్లో వాటాల వినియోగం మీద జరగ్గా.. రెండో సమావేశం విద్యుదుత్పత్తితో పాటు బోర్డు చేసిన సూచనల అమలుపైన చర్చ సాగింది.

రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో కీలకమైన ఈ సమావేశం జరుగుతున్న వేళ.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు వేర్వేరు చోట్ల ఉండటం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లటం తెలిసిందే. ఈ రోజు (గురువారం) ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ శంకుస్థాపన కోసం ఆయన ఒక రోజు ముందే వెళ్లటం తెలిసిందే. ఇదిలా ఉంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం తన వ్యక్తిగతంగా సాగిన సిమ్లా టూర్ ను ముగించుకొని పులివెందులకు వెళ్లారు.

ఓపక్క హాట్ హాట్ గా చర్చ జరుగుతున్న వేళ.. సమావేశానికి సంబంధించిన కీలక విషయాల్ని ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకోవటం.. ఏం జరుగుతోంది? ఏపీ సర్కారు వాదన ఏమిటన్న విషయాలు తెలుసుకొని.. వారి వాదనకు కౌంటర్ గా ఏం చెప్పాలన్న అంశాలపై ఎప్పటికప్పుడు సలహాలు.. సూచనలు ఇచ్చినట్లు చెబుతున్నారు.

సమావేశం జరిగిన పదకొండు గంటల పాటు ఆయన అధికారులకు అందుబాటులో ఉన్నారని చెబుతున్నారు. భౌతికంగా సమావేశంలో లేనప్పటికీ.. ఎవరేం మాట్లాడుతున్నారు? దానికి తెలంగాణ తరఫున ఏం చెప్పాలి? తెలంగాణ ప్రయోనాల కోసం ఏ రీతిలో కోట్లాడాలి? అన్న అంశాలపై దిశానిర్దేశం చేసినట్లుగా చెప్పాలి. చివర్లో విద్యుదుత్పత్తిని ఆపాలని బోర్డు చేసిన సూచనపై నిరసన వ్యక్తం చేస్తూ.. వాకౌట్ చేయాలన్న ప్లాన్ కూడా కేసీఆర్ దేనని చెబుతున్నారు. ఓపక్క ఢిల్లీలో పలువురితో భేటీ అవుతూనే.. హైదరాబాద్ లో జరుగుతున్న సమావేశానికి సంబంధించిన అంశాల్ని తెలుసుకోవటం.. తన అధిక్యతను ప్రదర్శించేలా వ్యవహరించారని చెబుతున్నారు. ఏపీ వాదనను బోర్డు సభ్యులు సానుకూలంగా స్పందించటం తెలిసిందే. పట్టువిడుపులతో ఏపీ అధికారులు వ్యవహరిస్తే.. తెలంగాణ మాత్రం పట్టుదలతో తాము చెప్పిందే జరగాలనట్లుగా వారి వాదన ఉందంటున్నారు.

తెలంగాణ తరఫున హాజరైంది వీరే

- తెలంగాణ జలవనరుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్
- ఈఎన్ సీ మురళీధర్
- అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ మోహన్‌కుమార్
- ఎస్ఈ కోటేశ్వర్‌రావు తదితరులు
ఏపీ తరఫున హాజరైంది వీరే
- ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలారావు
- ఈఎన్ సీ నారాయణరెడ్డి తదితరులు