Begin typing your search above and press return to search.
కీలక మార్పులు.. కసరత్తులో కేసీఆర్
By: Tupaki Desk | 27 Jan 2019 12:26 PM GMTతెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాబోయే కాలానికి కాబోయే సీఎంగా చెప్పుకునే కేటీఆర్ కు ఎలాంటి అవరోధాలు, ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి. ఇందులో భాగంగా ఎంపీ సీట్ల విషయంలో భారీ మార్పులు చేయబోతున్నట్టు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీచేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఈ దెబ్బతో నల్గొండలో ఉన్న కొద్దిపాటి కాంగ్రెస్ హవా కూడా తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే కేసీఆర్ కు బంగారు బాతుగుడ్డు లాంటి మెదక్ సీట్ ఉండగా, కోరి నల్గొండలోకి ఎందుకు వస్తున్నట్టు. ఇక్కడే అసలైన రాజకీయం కనిపిస్తోంది.
అన్నీ అనుకున్నట్టు జరిగితే తనకు చెందిన మెదక్ సీట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా మేనల్లుడు హరీష్ రావును రంగంలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఇలా చేయడం వల్ల కేసీఆర్ కు రెండు లాభాలు. ఒకటి రాష్ట్రంలో కేటీఆర్ కు ప్రత్యామ్నాయంగా పార్టీలో మరో శక్తి లేకుండా చేయడం, ఇక రెండోది పార్లమెంట్ లో తనకు మద్దతుగా మేనల్లుడు ఉండడం. ఇలా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే కాన్సెప్టుతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారట. ఈ సీట్ల సర్దుబాటుపై త్వరలోనే ఓ నిర్ణయం రానుంది.