Begin typing your search above and press return to search.
ఢిల్లీలో కేసీఆర్ కొత్త స్కెచ్.. వెయ్యి గజాల స్థలంలో ప్లాన్
By: Tupaki Desk | 28 Dec 2018 7:06 AM GMTదేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం అంటూ ఢిల్లీ బాట పట్టిన గులాబీ బాస్ , తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే వివిధ పార్టీల నేతలతో సమావేశం అవడం, పలువురు ముఖ్యమంత్రులను కలుసుకుంటున్న సంగతి తెలిసిందే. పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న గులాబీ పార్టీ నేత తాజాగా ఢిల్లీలో తన ముద్రను చాటుకునేందుకు నిర్ణయించారు. దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన ఇందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. తనదైన ముద్రతో ఢిల్లీలో పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం సిద్ధమయ్యారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీఆర్ ఎస్ కు ఢిల్లీలో కార్యాలయం నిర్మించుకోవడానికి వేయి గజాల స్థలం కేటాయించే అవకాశముంది. సంక్రాంతి పండగ తర్వాత ఢిల్లీలో కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. రెండు మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కేసీఆర్ పార్టీ ఆఫీసు నిర్మాణానికి అనువైన స్థలం కోసం పార్టీ ఎంపీలు ఇవాళ కొన్ని ప్రభుత్వ స్థలాలు పరిశీలించాలని ఆదేశించారు. ఎంపీలతో పాటు ప్రముఖ వాస్తు నిపుణుడు సుధాకర్ తేజ కూడా పరిశీలనలో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మధ్యాహ్నం ఆయా స్థలాలను స్వయంగా పరిశీలించి, అనువైన స్థలం ఎంపిక చేసే అవకాశముంది.
ఇదిలా ఉండగా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం పార్టీ ఆఫీసుల కోసం కసరత్తు చేస్తున్నారు. 30 జిల్లాల్లో టీఆర్‌ఎస్ కార్యాలయాల నిర్మాణానికి కేటాయిచిన స్థలాలు అనుకూలంగా ఉన్నాయో లేదో తెలుపాలని కేటీఆర్ పార్టీ నేతలను కోరారు. అనువుగా ఉన్న చోట్ల వెంటనే చదును చేయించాలని, అనుకూలంగా లేకుంటే ప్రత్యామ్నాయ స్థలాలు వెతుకాలని పార్టీ జిల్లా ఇంచార్జులు, ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. అన్ని జిల్లాల కార్యాలయాలు ఒకే మోడల్‌లో ఉండేలా బ్లూ ప్రింట్ తయా రు చేయిస్తున్నామన్నారు. పార్టీ సభ్యత్వ నమోదుపైనా కేటీఆర్ సమీక్షించారు. కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపుకార్డు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నాయకులను ఆదేశించారు. సభ్యత్వ నమోదులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పూర్తి వివరాల నమోదు పై సమగ్ర కార్యాచరణ ఖరారు చేయాలని సూచించారు.