Begin typing your search above and press return to search.
కేటీఆర్ కారం మాటకు అఖిలేశ్ రియాక్షన్ ఇలా!
By: Tupaki Desk | 3 May 2018 4:49 AM GMTయూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్ పర్యటన ఆసక్తికరంగా సాగింది. బేగంపేట ఎయిర్ పోర్ట్ కు వచ్చిన అఖిలేశ్ కు.. మంత్రి కేటీఆర్ స్వయంగా వెళ్లటం.. వెంట పెట్టుకురావటం ఒక ఎత్తు అయితే.. తన ఇంటికి వచ్చిన అఖిలేశ్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. అప్యాయంగా మాట్లాడారు.
మధ్యాహ్నవేళకు ప్రగతిభవన్ కు చేరుకున్న అఖిలేశ్ కోసం ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఇందులో మటన్ బిర్యానీ.. చికెన్ బిర్యానీ.. మటన్ కర్రీ.. చికెన్ కర్రీ.. చేపల కూర వంటి నాన్ వెజ్ ఐటెమ్స్ తో పాటు.. పప్పు.. మిక్సెడ్ వెజిటబుల్స్ కర్రీ.. రోటీ.. రైస్ లాంటి వాటిని వడ్డించారు. భోజనం చేసే సమయంలో తమ వంటల్లో కారం ఎక్కువగా ఉంటుందన్న మాటను అఖిలేశ్ ను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ అనగా.. దానికి బదులుగా అలాంటిదేమీ లేదంటూ తమ కారం ఇంతే ఉంటుందన్న మాటను చెప్పారు. అంత కారం ఏమీ లేదు.. బాగానే ఉన్నాయన్న మాట అఖిలేశ్ నోటి నుంచి వచ్చింది.
అన్నంతో పాటు మామిడి పండ్ల ముక్కల్ని అఖిలేశ్ ఇష్టంగా తినటం కనిపించింది. యూపీ రాజధాని లక్నో నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్న అఖిలేశ్.. నగరంలో ఉన్నంతసేపు బిజిబిజీగా ఉన్నారు.