Begin typing your search above and press return to search.
చేసిన తప్పునే కేసీఆర్ మళ్లీమళ్లీ చేస్తున్నారా?
By: Tupaki Desk | 7 Dec 2021 5:33 AM GMTరాజకీయాలు అన్న తర్వాత విభేదాలు సహజం. అప్పటివరకు అప్యాయంగా తనకు అత్యంత సన్నిహితంగా ఉంచుకున్న నేతపై.. గడిచిన కొంతకాలంగా కత్తి కడుతున్నట్లుగా కేసీఆర్ సర్కారు తీరు ఉందన్న విమర్శలు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు కేసీఆర్ ప్రభుత్వానికి ఏ మాత్రం సానుకూలతను పెంచకపోగా.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని మరో స్థాయికి తీసుకెళ్లేలా కేసీఆర్ తీరు ఉందన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది. టీఆర్ఎస్ అధినేతగా.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఒక తరహా వాదనను తరచూ వినిపిస్తుంటారు. ఏదైనా ఆరోపణతో కానీ.. మరేదైనా డిమాండ్ తో కానీ.. ఎన్నికలకు వెళ్లిన తర్వాత.. ప్రజా తీర్పుకు లోబడి ఉండాలన్నట్లుగా ఆయన వాదన ఉంటుంది.
ఆ లెక్కన చూసినప్పుడు తమ పార్టీలో సుదీర్ఘంగా సాగి.. కీలక పదవుల్ని చేపట్టిన ఈటల రాజేందర్ మీద భూకబ్జా ఆరోపణలు వచ్చాయంటూ ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించటం తెలిసిందే. ఆ మాటకు వస్తే ఈటల రాజేందర్ మీదనే కాదు.. ఎంతోమంది టీఆర్ఎస్ నేతల మీద ఆరోపణలు రావటమే కాదు.. పత్రికల్లోనూ.. మీడియాలో తాటికాయంత అక్షరాలతో ప్రచురితమైనా.. వాటి మీద స్పందించని ప్రభుత్వం.. ఎలాంటి ఆరోపణలు లేని ఈటల మీదన మాత్రం ఇలా చేయటం ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఆరోపణల నేపథ్యంలో మంత్రి పదవి నుంచి తొలగించటం.. ఆ సందర్భంగా అధికారులు.. ఇటు కేసీఆర్ కు చెందిన సొంత మీడియా సంస్థ.. ఈటల ఆర్థిక ఆరాచకాలకు సంబంధించిన బోలెడన్ని వార్తల్ని ప్రచురించాయి. అంతకు ముందు వరకు అత్యద్భుతమైన ఉద్యమ నేతగా.. పార్టీకి తురుపుముక్కగా అభివర్ణించిన దానికి భిన్నంగా ఈటల మీద చేసిన వ్యాఖ్యలు అన్ని ఇన్ని కావు. ఈ నేపథ్యంలోనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల.. బీజేపీలోకి చేరారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికను ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ ఉప ఎన్నిక గండాన్ని గట్టెక్కేందుకు ఏకంగా రూ.300-400 కోట్ల వరకు ఖర్చు చేసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చివరకు ‘దళిత బంధు’ అంటూ ఒక భారీ పథకానికే తెర తీశారు. ఇంత చేసినా.. టీఆర్ఎస్ ఓటమి తప్పలేదు. అంటే.. ఉప ఎన్నిక ద్వారా ప్రజలు తేల్చిందేమంటే.. ఈటల రాజేందర్ తప్పు చేయలేదని. ఆయనపై ఆరోపణలు అబద్ధమన్న విషయాన్ని తేల్చారు. మరి.. ప్రజాతీర్పు అంత స్పష్టంగా ఉన్నప్పుడు.. మళ్లీ ఆయన భూముల మీద అధికారులు ఆరోపణలు చేయటం.. దాదాపు 70 ఎకరాలకు పైనే అసైన్డు.. సీలింగ్ భూములు ఉన్నట్లుగా మెదక్ జిల్లా కలెక్టర్ నిగ్గు తేల్చటం సంచలనంగా మారింది.
రాజకీయాల్లో దేన్ని తెగే వరకు లాగకూడదని చెబుతారు. ఆ విషయంలో కేసీఆర్ సర్కారు అన్ని హద్దులు.. గీతల్ని దాటేస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎనిమిది మంది రైతులు ఈ ఏడాది ఏప్రిల్ లో సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేసిన తర్వాత.. అధికారులు ఎంతటి ఉత్సాహంతో పని చేశారో అందరికి తెలిసిందే. ఇదే ఉత్సాహం.. తెలంగాణ రాష్ట్రంలో ఆరోపణలు వచ్చిన ప్రతి ఒక్కరి మీదా ఎందుకు లేదన్నది ఒక ప్రశ్న. ఇప్పటికే ఈటల విషయంలో గులాబీ బాస్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారని.. ఆయన్ను వెంటాడి.. వేధిస్తున్నారన్న భావన ప్రజల్లోకి వెళ్లింది.
నిజానికి ఇదే అంశం.. ఈటల మీద అమితమైన సానుభూతిని పొంగిపొర్లేలా చేసింది. ఈ కారణంతోనే అధికార పార్టీ ఎన్ని చెప్పినా.. హుజూరాబాద్ ప్రజలు ఈటల వెంటే నిలబడ్డారు. ఉప ఎన్నిక ఫలితం అనంతరం కేసీఆర్ ఆత్మవిమర్శ చేసుకుంటారని.. ఈటల మీద తాను సంధించిన అవినీతి అస్త్రాలకు స్టేటస్ కో ఇస్తారన్న భావన వ్యక్తమైంది. అందుకు భిన్నంగా.. పరిణామాలు చోటు చేసుకోవటం చూస్తే.. ఈటల ఎపిసోడ్ ను సీఎం చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
వైరం రాజకీయం వరకు ఫర్లేదు కానీ వ్యక్తిగతంగా మారినప్పుడే.. ఎంత పెద్ద నేత అయినా తప్పులు చేస్తారని చెబుతారు. తాజా పరిణామాల్నిచూస్తే.. కేసీఆర్ సైతం అందుకు మినహాయింపు కాదన్న భావన కలుగక మానదు. ఏమైనా.. ఈటల విషయంలో కేసీఆర్ సర్కారు అవసరానికి మించి స్పందించటమే కాదు.. మరింత సానుభూతి వెల్లువయ్యేలాతాజా పరిణామాలు ఉన్నాయని.. ఇది ప్రభుత్వానికి ప్రతికూలతను తీసుకురావటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. సీఎం కేసీఆర్ కు ఈ ఫీడ్ బ్యాక్ ఎందుకు చేరట్లేదు?