Begin typing your search above and press return to search.

సాగ‌ర్ వార్ః కేసీఆర్ మార్కు రాజ‌కీయం బీజేపీ ప్లాన్ తోనే క‌మ‌ల‌ద‌ళానికి షాక్‌!

By:  Tupaki Desk   |   30 March 2021 2:01 PM GMT
సాగ‌ర్ వార్ః కేసీఆర్ మార్కు రాజ‌కీయం బీజేపీ ప్లాన్ తోనే క‌మ‌ల‌ద‌ళానికి షాక్‌!
X
దుబ్బాక ఉప ఎన్నిక‌లో విజ‌యంతో రాష్ట్రం మొత్తం బీజేపీ గాలి వీస్తోంద‌న్నారు. జీహెచ్ ఎంసీ ఫ‌లితాల‌తో మొత్తం అయిపోయింది.. ఇక అధికారం త‌మ‌దే అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు వ‌చ్చేస‌రికి మొత్తం త‌ల‌కిందులైంది. రెండు స్థానాల్లోనూ ఓడిపోగా.. 'న‌ల్గొండ'స్థానంలో నాలుగో ప్లేసుకు పడిపోయింది. ఇలాంటి ప‌రిస్థితుల్లోనే నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌కు సిద్ధ‌మైంది క‌మ‌లం పార్టీ.

అయితే.. ఇక్క‌డ కేసీఆర్ మార్కు రాజ‌కీయంతో బీజేపీకి దెబ్బ‌మీద దెబ్బ ప‌డుతోందనే అభిప్రాయం వ్య‌క్త‌‌మ‌వుతోంది. ముందుగా.. టీఆర్ఎస్ లో టిక్కెట్టు ఆశించి,‌ భంగ‌ప‌డిన వారిలో ఒక‌రికి గాలం వేద్దామ‌ని బీజేపీ ప్ర‌య‌త్నించింద‌ని అంటున్నారు. అందుకోస‌మే.. చివ‌రి వ‌ర‌కు అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌కుండా వేచి చూసింద‌ని చెబుతున్నారు.

కానీ.. కేసీఆర్ ఇక్క‌డ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మొద‌టి నుంచీ నోముల కొడుక్కి టిక్కెట్ ఇవ్వ‌ట్లేద‌నే విష‌యం ప్ర‌చారంలో ఉండేలా చూశారు. కానీ.. చివ‌ర‌కు నోముల కుమారుడు భ‌గ‌త్ కే టిక్కెట్ ఇచ్చారు. దాంతో.. అసంతృప్తుల‌ను కూడా ఈజీగా బుజ్జ‌గించే అవ‌కాశం దక్కింది. ఇత‌రుల్లో ఎవ‌రికి ఇచ్చినా.. లెక్క వేరే విధంగా ఉండేది. కానీ.. నోముల కొడుక్కే ఇవ్వ‌డంతో ఎవ‌రూ గ‌ట్టిగా మాట్లాడ‌లేని ప‌రిస్థితి.

ఇది బీజేపీకి గ‌ట్టి దెబ్బ‌గా చెబుతున్నారు. టీఆర్ ఎస్ అసంతృప్తుల‌ను క్యాష్ చేసుకోవాల‌ని చూస్తే అది జ‌ర‌గ‌లేద‌ని అంటున్నారు. అంతేకాకుండా.. బీజేపీ వ్యూహాన్ని దానిపైనే ప్ర‌యోగించారు కేసీఆర్ అని అంటున్నారు. బీజేపీలో టిక్కెట్ ఆశించి, భంగ‌ప‌డిన వారికి గులాబీ కండువా కప్పుతున్నారు.

ఇప్ప‌టికే బీజేపీ నేత క‌డారి అంజ‌య్య టీఆర్ ఎస్ లో చేర‌బోతున్నారు. తాజాగా.. మ‌రో నేత నివేదితా రెడ్డి కూడా గులాబీ గూటికి చేర‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఆమె కూడా నాగార్జున సాగ‌ర్ టికెట్ ఆశించారు. ఈ విధంగా బీజేపీ ప్లాన్ తోనే ఆ పార్టీని దెబ్బ కొడుతున్నార‌ని అంటున్నారు విశ్లేష‌కులు.