Begin typing your search above and press return to search.

ఇన్ని కాంబినేషన్లు కేసీఆర్ కు మాత్రమే సాధ్యమేమో?

By:  Tupaki Desk   |   20 Feb 2022 10:38 AM GMT
ఇన్ని కాంబినేషన్లు కేసీఆర్ కు మాత్రమే సాధ్యమేమో?
X
అందరూ అన్ని చేయలేరని చెబుతారు. కానీ.. అందుకు కొన్ని మినహాయింపులు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలోనూ ఇది వర్తిస్తుంది. ఏకకాలంలోనే ఆయన సినిమా హీరో మాదిరి అన్ని ఫీట్లు వేస్తున్నారు.

ఒకవైపు కొత్త స్నేహాల్ని షురూ చేస్తూ.. వాటిని తర్వాతి దశల్లోకి తీసుకెళ్లే కసరత్తు చేస్తూనే.. మరోవైపు కొత్త శత్రుత్వాలకు సవాలు చేస్తూ సై అంటే సై అంటున్నారు. అన్నింటికి మించిన ఆయన సామర్థ్యానికి నిదర్శనంగా మరో అంశాన్ని ఇక్కడ ప్రస్తావించాలి.

అమితమైన స్నేహం.. అంతకు మించిన ఆరాధన చేసే వారితోనూ లొల్లి పెట్టుకొని..రాజీ అన్నది లేకుండా నేనేమిటో చూపిస్తానన్న రీతిలో రియాక్టు అవుతున్న కేసీఆర్ తీరు ఇప్పుడు ఆసక్తికరంతా మారింది.

కేంద్రంలోని మోడీ సర్కారుతో పోరాడుతూ.. ఆయన్ను తన ప్రధమ శత్రువుగా పేర్కొంటున్న వైనం తెలిసిందే. ఇంతకాలం తెలంగాణ మీదనే ఫోకస్ పెట్టిన ఆయన.. ఇప్పుడు దేశ జాతీయ రాజకీయాల మీదా పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా ఎవరైనా ఏకకాలంలో ఒకట్రెండు పనులు మాత్రమే చేస్తారు. కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా నాలుగైదు పనులు చేసేయటం విశేషం.

మోడీ పరివారంపై ఫైటింగ్.. మరోవైపు కొత్తగా కలిసి వచ్చే మిత్రుల మనసుల్ని దోచుకోవటంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న ఆయన.. ఇవన్నీ సరిపోనట్లుగా తనకు జిగిరీ దోస్తు అయిన మై హోం రామేశ్వరరావు ద్వారా పరిచయమైన చినజీయర్ స్వామి పట్ల గుర్రుగా ఉండటం తెలిసిందే.

సమతామూర్తి విగ్రహావిష్కరణ వేళ ఏర్పాటు చేసిన శిలాఫలకంలో తన పేరు లేకపోవటంపై కసీఆర్ తీవ్రంగా ఫీల్ అయినట్లుగా చెబుతారు. అప్పటి నుంచి చినజీయర్ స్వామి మీద గుర్రుగా ఉన్న ఆయన..ముచ్చింతలో జరిగే కార్యక్రమానికి డుమ్మా కొట్టేయటం తెలిసిందే.

అంతేనా.. శాంతి హోమానికి వచ్చే అవకాశం ఉందని పెద్ద ఎత్తున అంచనాలు వినిపించాయి. తెర వెనుక కేసీఆర్ ను బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలించలేదని చెబుతున్నారు.

ఇటీవల కాలంలో పెరిగిన తన గ్రాఫ్ విషయంలో కేసీఆర్ లో మొండితనం.. కాన్ఫిడెన్సు మరింత ఎక్కువైందంటున్నారు. అందుకే.. మహా మొండిగా వ్యవహరిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఏమైనా ఏకకాలంలో కొత్త స్నేహాలు.. సరికొత్త శత్రుత్వం లాంటి వాటిని బ్యాలెన్సు చేసుకోవటం గులాబీ బాస్ కే సాధ్యమవుతుందేమో?