Begin typing your search above and press return to search.
మేయర్ పీఠం కోసం కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్..బీజేపీకి షాక్
By: Tupaki Desk | 7 Dec 2020 10:01 AM GMTగతంలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. బల్దియా బరిలో తామే గెలుస్తామన్న ధీమాతో ఉన్న అధికార పార్టీకి బీజేపీ షాకిచ్చింది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకున్న కమళ దళం...ఈ సారి ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీనిస్తూ 48 స్థానాలు కైవసం చేసుకుంది. 100 స్థానాల్లో గెలుస్తామన్న టీఆర్ఎస్ కేవలం 55 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక, ఎప్పటిలాగే ఎంఐఎం తన స్థాయికి తగ్గట్టుగా 44 స్థానాలు దక్కించుకుంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక జీహెచ్ఎంసీ ఎన్నికల కన్నా రసవత్తరంగా మారింది. దీంతో, వైరివర్గాలుగా బరిలోకి దిగిన ఎంఐఎం, టీఆర్ఎస్ లు పొత్తు పెట్టుకోక తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఒక వేళ ఈ పొత్తు కుదిరితే ఆ రెండు పార్టీలను ఇరుకున పెట్టి 2023 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బలపడాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్...ఇటు ఎంఐఎంతో పొత్తు పెట్టుకోకుండా, ఆ పార్టీ మద్దతును పరోక్షంగా కూడా తీసుకోకుండానే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మేయర్ ఎన్నికలో టీఆర్ఎస్ కి పోటీగా ఎంఐఎం కూడా అభ్యర్థిని నిలబెట్టి బీజేపీని పోటీనుంచి తప్పించాలన్న ప్లాన్ లో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.
150 డివిజన్లలో 76 డివిజన్లు దక్కించుకున్న పార్టీకే మేయర్ పీఠం దక్కుతుంది.150కి మరో 53 కలిపితే ఎలక్టోరల్ కాలేజీ సంఖ్య 203 అవుతుంది. దీంతో, మేయర్ పీఠం దక్కాలంటే మ్యాజిక్ ఫిగర్ 102 అవుతుంది. 55 స్థానాలు దక్కించుకున్న టీఆర్ఎస్ కు 38 మంది ఎక్స్ అఫిషియో సభ్యుల బలం కలిస్తే 93 సభ్యుల మద్దతుంటుంది. కొత్త సభ్యుల 5 సీట్లు కలుపుకున్నా....మ్యాజిక్ ఫిగర్ కు 4 అంకెల దూరంలో టీఆర్ఎస్ ఆగిపోతుంది. దీంతో, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎంఐఎం మద్దతు తీసుకోవడం లేదంటే ఎంఐఎంను మేయర్ ఎన్నికకు దూరంగా ఉంచడం టీఆర్ఎస్ కు ఉన్న రెండు ఆప్షన్లు. అయితే, మేయర్ బరిలో ఎంఐఎంని నిలబెట్టి బీజేపీ పోటీనుంచి తప్పుకునేలా చేయాలన్న మరో ఆప్షన్ ను కేసీఆర్ ఎంచుకున్నారని తెలుస్తోంది. ఈ మాస్టర్ స్ట్రోక్ తో సభలో ఉన్న హాజరు ప్రకారం సగానికి పైగా సీట్లు దక్కించుకున్న టీఆర్ఎస్ కే మేయర్ పీఠం దక్కుతుంది. ఈ రకంగా బీజేపీకి గులాబీ బాస్ షాకివ్వబోతున్నట్టు తెలుస్తోంది. మేయర్ ఎన్నిక చదరంగంలో కేసీఆర్ చాణక్య నీతితో మేయర్ ఎన్నిక కూడా రసవత్తరంగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.