Begin typing your search above and press return to search.
కేంద్రంపై నేరుగా యుద్ధానికి రెడీ..: నేడు టీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ మీటింగ్..
By: Tupaki Desk | 30 Jan 2022 5:39 AM GMTగత కొన్ని రోజులుగా కేంద్రంపై కేసీఆర్ రుసరుసలాడుతున్నారు. ధాన్యం కొనుగోలుతో పాటు ఇతర విషయాల్లో రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని, ఈ విషయంలో ఊరుకోబోమని ఆందోళన చేస్తున్నారు. కేసీఆరే స్వయంగా ధర్నాలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. అయితే త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ ఆందోళన మరింతగా చూపించాలని కేసీఆర్ ఆ పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈమేరకు ఆదివారం టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీసే అంశాలపై చర్చించి, వాటిపై గట్టిగా పోరాడాలని చెప్పనున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వర్ రావుతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆదివారం జరిగే సమావేశంలో మిగతా ఎంపీలకు కూడా ఈ విషయాలపై చర్చించనున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి ఆ పార్టీపై పోరాడుతున్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు చేయాలని అధికార పార్టీ నాయకులతో ఆందోళన చేయించారు. ఇటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను జైలుకు పంపించారు. అయితే కేసీఆర్ పై మరింత పోరాటం చేస్తానని బీజేపీ సైతం కౌంటర్ ఇస్తోంది. అయితే కేసీఆర్ మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా కేంద్రంపై ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అయితే ఈ పార్లమెంట్ సమావేశాల్లో కొన్ని అంశాలతో ఆందోళన చేయాలని ఎంపీలకు సూచించే అవకాశం ఉంది.
రాష్ట్రం సేకరించిన ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేసేలా ఒత్తిడి తీసుకు రావాలని డిమాండ్ చేయాలని సూచించే అవకాశం ఉంది. గత రెండు నెలల కింద నుంచి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన చేశారు. ఇప్పుడు పార్లమెంట్ వేదికగామరోసారి ఈ అంశాన్నిలేవనెత్తాలని చెప్పే అవకాశం ఉంది. ఇక నీటి విషయంలోనూ తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కాలేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు ఇచ్చేలా పోరాటం చేయనున్నారు. మిగతా ప్రాజెక్టుల విషయంలోనూకేంద్రం జోక్యం చేసుకొని పరిష్కరించాలని పట్టుబడే అవకాశం ఉంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సారాలు పూర్తి కావస్తోంది. ఇప్పటికీ విభజన సమస్యలను కేంద్రం పట్టించుకోలేదు. వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేయనున్నారు. ముఖ్యంగా తెలంగాణకు ఏయిమ్స్ సహా ఇతర కేంద్ర సంస్థలను ఇవ్వాలని కోరనున్నారు. అయితే సందర్భం వచ్చినప్పుడల్లా కేసీఆర్ వీటిపై మాట్లాడుతున్నారు. ఈసారి పార్లమెంట్ వేదికగా నిలదీసే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులను తాము కోరిన వెంటనే కేంద్రానికి ఇచ్చేయాలన్న కేంద్రం ప్రతిపాదనను ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ కేంద్రం ముందుకు ఈ విషయాన్ని మరోసారి తీసుకెళ్లాలని నిర్ణయించే అవకాశం ఉంది. దీంతో కేంద్రాన్ని ఇరుకు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు విషయంలోనూ ఎంపీలో పోరాటం చేసేలా సూచించనున్నారు. కొన్ని సమావేశాల్లో కేటీఆర్ కేంద్రంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే పార్లమెంట్ వేదికగా ఆందోళన చేపడితే సరైన న్యాయం జరిగే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. మొత్తంగా కేంద్రంతో నేరుగా పోరాడే అవకాశాన్ని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను అవకాశంగా మలుచుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు. గత పార్లమెంట్ సమావేశాల్లో ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన నిర్వహించారు. అయితే కేంద్రం సరైన సమాధానం ఇవ్వడం లేదని టీఆర్ఎస్ ఎంపీలో సమావేశాలను బహిష్కరించారు. మరి ఈసారి ఏ విధంగా పోరాటం చేస్తారో చూడాల్సి ఉంది.